• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దృశ్యం 2'లో అదిరిపోయే...

'దృశ్యం 2'లో అదిరిపోయే ట్విస్ట్ అదే!

By - Tupaki Desk
Update: 2021-04-15 14:30 GMT
'దృశ్యం' సినిమా కథ అంతా కూడా ఒక మధ్యతరరగతి కుటుంబం చుట్టూ .. ఒక ఆడపిల్ల తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక మధ్యతరగతి తండ్రి పడే ఆరాటంగా .. పోరాటంగా ఈ కథ నడుస్తుంది. ప్ర్రతి మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి .. వెంకటేశ్ పాత్ర్రకి కనెక్ట్ అవుతాడు. ఆ పాత్రను చివరివరకూ ఫాలో అవుతూ వెళతాడు.  సినిమా ఎక్కడికక్కడ అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ .. ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది.

ఈ సినిమాలో హీరో తాను హత్య చేసిన యువకుడిని నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రదేశంలో పూడ్చి పెడతాడు. ఇదే ఈ సినిమాలో హైలైట్ అయింది. పోలీసులు హీరో ఇంటిచుట్టూ తిరుగుతుంటారు .. హీరో దాచిన శవం పోలీస్ స్టేషన్ క్రిందే ఉంటుంది. సినిమా చూసిన ప్ర్రతి ఒక్కరికీ కూడా ఈ ఐడియా బాగుందనిపిస్తుంది. అంతకు మించిన సీన్ ఒకటి 'దృశ్యం 2'లో కనిపిస్తుంది. మొదటిభాగంలో హీరో పోలీసులను తన ఉచ్చులో బిగిస్తే, రెండవ భాగంలో పోలీసులు అతనిని ఉచ్చులో బిగించడానికి ఏం చేశారనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

పోలీసుల వ్యూహానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తంలోకి ఇదే హైలైట్ సీన్ గా నిలుస్తుంది. మలయాళ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ కి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనుంది. ఇప్పటికే చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మలయాళ సీక్వెల్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన, తెలుగు సీక్వెల్ కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో వెంకటేశ్ అభిమానులు ఉన్నారు. 
Tags:    
  • Jeethu Joseph 
  • Meena 
  • Drishyam2 
  • Mollywood 
  • Tollywood 
  • Rana Daggubatil 
  • Venkatesh 
  • Telugu News 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS