• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కబడ్డీ కోచ్ గా మారబోతున్న...

కబడ్డీ కోచ్ గా మారబోతున్న మిల్కీ బ్యూటీ...!

By - Tupaki Desk
Update: 2020-05-05 06:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'శ్రీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా 'హ్యాపీడేస్' సినిమాతో అమాంతం క్రేజ్ పెంచేసుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోలతో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మిల్కీ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతుంది. అయినా అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ సినిమా చిన్నదా పెద్దదా అనే బేధాలు లేకుండా నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారింది. సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో తమన్నా ఒక్క ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు అంటేనే తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజ్. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా చేస్తూనే వస్తోంది. గత ఏడాది 7 సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా జయాపయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

కాగా లాక్ డౌన్ లో ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'సీటిమార్' సినిమా విశేషాలు చెప్పుకొచ్చింది తమన్నా భాటియా. సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'సీటీమార్' సినిమాలో తమన్నా ఇంతకు ముందు ఎప్పుడు యాక్ట్ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తోందట. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి గా కనిపించబోతోంది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తుండగా.. తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించనున్నానని తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాని.. అది కొంచెం కష్టంగా అనిపించినా డైరెక్టర్ సహకారంతో మాట్లాడగలిగానని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ రోల్ తో ముందుకొస్తున్న తమన్నా ఈ సినిమా తనని మళ్లీ ట్రాక్ లోకి తెస్తుంది అని నమ్మకంతో ఉంది. 'సీటిమార్' ఈ సమ్మర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత అనుకూలమైన తేదికి ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
Tags:    
  • Milky Beauty 
  • Tamanna 
  • Gopichand 
  • Tollywood 
  • Tolllywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS