ప్రజలు నా నగ్న ఫోటోనే చూశారు కానీ 10 మిలియన్ల ఫోటోలున్నాయి!
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి! అన్నారు పెద్దలు. పుర్రె పుర్రెకో బుద్ధి చూస్తుంటాం. ఒకరి ఆలోచనలు ఇంకొకరికి ఉండవు. ఏ ఒక్కరూ ఇంకొకరిలా ఉండరు. ఇదిగో 50ఏళ్ల ఈ పెద్దాయన కూడా అంతే. ఏదో ఒక సెన్సేషన్ తో ఎప్పుడూ వార్తల్లో నిలవడం మోడల్ కం నటుడు మిలింద్ సోమన్ ప్రత్యేకత.
తనకంటే చాలా చిన్న వయసు ఉన్న యువతిని పెళ్లాడిన మిలింద్ వేపకాయంత వెర్రిని చాలామంది వెటకారమాడారు. వ్యంగ్యంగా పంచ్ లు విసిరారు. కానీ ఆయన అదేదీ పట్టించుకోకుండా తన పనిలో తానుంటారు. ఇప్పుడు తన 50వ పుట్టినరోజు సందర్భంగా బీచ్ లో నగ్నంగా పరుగులు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు మిలింద్ సోమన్. ఆ ఫోటో క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యి షేక్ చేసింది. తన 50 వ పుట్టినరోజు సందర్భంగా అతని భార్య అంకితా కొన్వర్ ఈ ఫోటో తీశారట.
అయితే ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వినిపించాయి. కొందరు తీవ్ర అసహనంతో రగిలిపోతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వైరల్ ఫోటో పోలీసు కేసులకు కారణమైంది. దక్షిణ గోవా జిల్లా పోలీసులు అశ్లీలతకు కారకుడైన మోడల్ కం యాక్టర్ మిలింద్ పై కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత ఈ వ్యవహారంపై అతడు స్పందించిన తీరు కూడా అంతే వివాదాస్పదంగా ఉంది. ``నాకు ఎందుకో తెలీదు! ప్రజలు ఇంతకు ముందు ఎవరినీ నగ్నంగా చూడలేదా.. ఇదేమి వెర్రి!`` అంటూ ప్రతి ఎటాక్ చేశాడు మిలింద్. తనని విమర్శించేవాళ్లను తాను ఎప్పుడూ పట్టించుకోనని కూడా అన్నారు.
``నేను నిజంగా ట్రోలర్స్ ను గమనించను. కొన్నిసార్లు నేను సరదా కోసమే ఏం రాశారో చూస్తాను. మీరు ఆ (నగ్న) చిత్రాన్ని చూసి రెచ్చిపోయినా అది నిజంగా ట్రోలింగ్ కాదు. ట్రోలింగ్ అంటే ఏమిటో నాకు తెలుసు ... నా నగ్న ఫోటో కి 99శాతం మంది వావ్! ఇది ఆశ్చర్యంగా ఉంది! అన్నారు. ఇది నా భార్య తీసిన ఫోటో. కొంతమంది ఫోటోగ్రాఫర్ తీసిందని కొన్ని వార్తాపత్రికల్లో రాసినది నిజం కాదు`` అని వివరణ ఇచ్చారు.
ప్రజలు కొంచెం షాక్ కు గురయ్యారని నేను భావిస్తున్నాను! ముఖ్యంగా దుష్ఠ స్వభావం ఉన్నవారు. ఇంటర్నెట్ సంస్కృతికి ఇది క్రొత్తది కాదు.. ఎందుకంటే ఈ వ్యక్తులు ఇప్పటికే ఇంటర్నెట్ అనే వాస్తవ ప్రపంచంలో ఉన్నవారే. వారికి నా చిత్రం మేల్కొలుపు కాల్ అని నేను అనుకుంటున్నాను. ఇన్ స్టాగ్రామ్ లో నగ్నంగా ఉన్న హ్యాష్ ట్యాగ్ ను శోధించండి. 10 మిలియన్ పోస్టులు ఇలాంటివే ఉంటాయి. ప్రజలు అవన్నీ చూడలేదు`` అని మిలింద్ సవివరంగా కోట్ చేసి మరీ వివరించారు.