ఆస్తి మోసం కేసులో KRK దేశబ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాడు?

Update: 2021-06-17 14:30 GMT
న‌టుడు కం సినీవిమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ ను భారతదేశంలో నిషేధించారని సింగర్ మికా సింగ్ సంచలన ప్ర‌క‌ట‌న చేశారు. ఆస్తి మోసమే దీనికి కారణమని ఆయ‌న పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తో కేఆర్కే గొడ‌వ‌ల నేప‌థ్యంలో ఈ వార్త‌కు విప‌రీత‌మైన ప్రాచుర్యం ల‌భిస్తోంది.

కేఆర్కే స‌ల్మాన్ నే కాదు.. ఇంకా చాలామందిని అటాక్ చేయ‌నున్నాడ‌ని.. అందుకు పరిశ్రమలోని ప‌లువురికి కె.ఆర్‌.కె తన తుపాకీ శిక్షణ ఇచ్చారని మికా సింగ్ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. #KRK కుట్టా పేరుతో ఒక డిస్ ట్రాక్ ను మికా సింగ్ విడుదల చేశారు.

అంతేకాదు ఆస్తి మోసం కారణంగా భారతదేశం నుంచి KRK ని నిషేధించినట్లు మికా పేర్కొన్నారు. అతను ఇక‌పై భారతదేశంలోకి ప్రవేశించలేడు. ఇది నిజం కాకపోతే కేఆర్కే బయట అడుగు పెట్టాలి. ఇదంతా అబద్ధమని చెప్పాలి! అంటూ మికా అటాక్ చేశారు. కేఆర్కే ఎప్పుడు భారతదేశానికి తిరిగి రావాలని ఆలోచిస్తున్నాడో అధికారిక ప్రకటన చేయాలని మికా డిమాండ్ చేశారు.

రెండు కారణాల వల్ల కేఆర్కే భారతదేశానికి తిరిగి రాలేదని నాకు స్ప‌ష్టంగా తెలుసు. కేఆర్కే పై కొన్ని సంవత్సరాల క్రితం మేము కేసు పెట్టాము. నా వద్ద FIR కాపీలు ఉన్నాయి. అతను రెండు ఆస్తులను నా బంధువుకు విక్రయించాడు. ఆ ఆస్తులలో ఒకటి అత‌డికి చెందినది. రెండవది అతని సోదరుడికి చెందినది. కేఆర్కే తన ఆస్తిపై కాగితాలపై సంతకం చేయ‌డ‌మే గాక‌...తన సోదరుడి ఆస్తి కాగితంపైనా సంతకం చేశాడు. దీనిపై ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదైంది. కెఆర్కె తాను సంతకాన్ని నకిలీ చేశానని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు అని మికా తెలిపారు.

అత‌డికి లెక్కలేనన్ని సార్లు కోర్టు నోటీసు ఇచ్చింది. కానీ అతను వాటన్నింటినీ విస్మరిస్తున్నాడు. కేఆర్కే ఇప్పుడు భారతదేశానికి తిరిగి రాలేడు. అతడు పరారీలో ఉన్నాడు. దేశంలో అత‌డు నిషేధం. అతను తిరిగి వస్తే వెంట‌నే అరెస్టు అవుతాడు అని మికా అన్నారు.
Tags:    

Similar News