నాని హీరోయిన్ కి మెగా ఆఫర్

Update: 2016-02-19 06:16 GMT
గత కొంతకాలంగా టాలీవుడ్ తెరపై చాలా మంది కొత్త హీరోయిన్లు మెరిసినా.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించడం చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో ఒక భామ మెహ్రీన్ పీర్జాడా కౌర్. కృష్ణగాడి వీర ప్రేమగాధలో నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన మెహ్రీన్.. ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. సినిమా హిట్ కావడంతో అమ్మడికి డిమాండ్ కూడా పెరుగుతోంది.

యాక్టింగ్ లోనూ సత్తా చాటడంతో మెహ్రీన్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పుడీ చిన్నదాన్ని మెగా ఆఫర్ తలుపు తట్టిందనే న్యూస్ హాట్ హాట్ గా ఉంది. మెగా సుప్రీంస్టార్ సాయిధరం తేజ్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు ఈమెకు ఆఫర్ వచ్చింది. బీవీఎస్ రవి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించనున్న సినిమాలో.. తేజు సరసన  హీరోయిన్ గా మెహ్రీన్ ని అడిగారు. రెండో సినిమాకే మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ రావడంతో.. మెహ్రీన్ లక్కీ అంటున్నారు ఫిలింనగర్ జనాలు.

మెగా ఆఫర్ మాత్రమే కాకుండా.. కళ్యాణ్ రామ్ తో పూరీ జగన్నాథ్ తీయనున్న సినిమా కోసం కూడా మెహ్రీన్ ని అడిగారు. తెలుగు రాకపోయినా.. హావభావాలు పలికించడంలో ట్యాలెంట్ చూపించడమే వరుస ఆఫర్లకు కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కృష్ణగాడి కోసం విజయయాత్రలు చేస్తున్న ఈ భామ.. వాటి నుంచి తిరిగిరాగానే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News