బిగ్ బాస్ బ్యూటీకి మెగాస్టార్ ఆఫ‌రిచ్చారా?

Update: 2021-03-27 13:53 GMT
త‌న‌దైన అందం మ‌త్తు క‌ళ్ల‌‌తో మాయ చేసింది బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య‌. న‌వ్వితే చాలు చిల్లు బుగ్గ‌లు ఊరిస్తాయి. బిగ్‌బాస్-4 సీజన్ ఇంటి స‌భ్యురాలిగా త‌నదైన చాక‌చ‌క్యం అందంతోనే బోలెడంత హైప్ తెచ్చింది ఈ బ్యూటీ.

హైద‌రాబాదీ అయిన ఈ అమ్మ‌డు మోడ‌ల్ గా కొన‌సాగుతూనే.. టాలీవుడ్ లో చాలా సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసిందిట‌. కానీ ద‌శ తిరిగేంత పెద్ద‌ ఆఫ‌ర్ అయితే రాలేదు. బిగ్ బాస్ 4 ఫైన‌ల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారే ఈ అమ్మ‌డి అందానికి ఫిదా అయిపోయాన‌ని పొగిడేశాడు. నాగార్జున హోస్ట్ గా ఉన్న వేదిక‌పై త‌న‌దైన శైలిలో ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ క‌చ్ఛితంగా త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చేస్తానంటూ చిరు టెంప్ట్ చేశారు.

ఆయ‌న ఆఫ‌ర్ ఇచ్చారా లేదా? అన్న‌ది అటుంచితే దివికి బిగ్ ‌బాస్‌ పుణ్యమాని హీరోయిన్ గా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌తో పాటు.. క‌థానాయిక‌గానూ ఆఫ‌ర్లు వ‌చ్చాయిట‌. ఓ రెండు చిన్న సినిమాల దర్శక నిర్మాతలు పిలిచి మ‌రీ అవ‌కాశం క‌ల్పించార‌ని తెలిసింది. బిగ్ బాస్ వ‌ల్ల‌నే ఈ అమ్మ‌డు వెలుగులోకి వ‌చ్చింది. ఈ అమ్మ‌డి వెండితెర డ్రీమ్స్ స‌ఫ‌ల‌మ‌వ్వాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News