• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్‌ తో 'పవర్‌'...

మెగాస్టార్‌ తో 'పవర్‌' వంటి మాస్‌ మసాలా పక్కా

By - Tupaki Desk
Update: 2021-10-21 05:42 GMT
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ ను చిరంజీవి చేస్తున్నాడు. మరో వైపు భోళా శంకర్ సినిమాను కూడా చిరంజీవి కన్ఫర్మ్‌ చేశాడు. గాడ్‌ ఫాదర్‌ సినిమా 'లూసీఫర్‌' కు రీమేక్ కాగా.. భోళా శంకర్ సినిమా 'వేదాళం' సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ రెండు సినిమాలను ముగించాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. జై లవకుశ వంటి విభిన్న సినిమాను తెరకెక్కించిన బాబీ మెగాస్టార్‌ కోసం ప్రత్యేకమైన కథను సిద్దం చేశాడని అంటున్నారు.

రవితేజతో పవర్ వంటి మాస్ మసాలా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ ఇప్పుడు చిరంజీవి కోసం కూడా అదే తరహా మాస్ మసాలా సినిమాను తెరకెక్కించేందుకు గాను స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవిని 1990 ల్లో ప్రేక్షకులు ఎలా చూశారో అలా తన సినిమాలో చూపించేందుకు గాను బాబీ ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఒక ఫొటో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి వయసు మూడు పదులు తగ్గినట్లుగా కనిపించింది. కనుక చిరంజీవిని తన సినిమాలో 1990 ల్లో ఎలా అభిమానులు చూశారో అలాగే చూడబోతున్నారు అంటూ బాబీ చెప్పకనే చెప్పినట్లుగా అనిపిస్తుంది.

బాబీ మాస్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి బాబీతో సినిమా అంటే మెగాస్టార్‌ అభిమానులు ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఊహించుకుంటారు. అందుకే బాబీ చాలా వర్కౌట్ చేసి స్క్రిప్ట్‌ ను సిద్దం చేస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్ పర్యవేక్షణ కూడా ఈ సినిమా స్క్రిప్ట్‌ కు ఉందని సమాచారం అందుతోంది. వారి యొక్క మాస్ స్టైల్‌ మరియు పవర్‌ తరహా మాస్ ప్రజెన్స్ ను దర్శకుడు బాబీ మెగాస్టార్‌ సినిమాకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తో సినిమా అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశంను ప్రతి ఒక్కరు సాధ్యం అయినంతగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తెలుగు లో బాబీ మరో భారీ బ్లాక్ బస్టర్ ను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    
  • megastar 
  • powerstar 
  • bobby 
  • Acharya 
  • Godfather 
  • BHOLA SHANKAR 
  • pspk 
  • alluarjun 
  • pushpa 
  • gani 
  • nagababu 
  • fans 
  • megapowerstar 
  • telugu 
  • rrr 
  • megastar 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS