• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ లేకుండానే...

హీరోయిన్ లేకుండానే మెగాస్టార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు..!

By - Tupaki Desk
Update: 2022-04-28 03:30 GMT
తెలుగులో కమర్షియల్ సినిమా అనగానే హీరోకి జోడీగా హీరోయిన్ ఉండాలి.. ఇద్దరి మధ్య సాంగ్స్ - డ్యాన్సులు - రొమాన్స్ ఉండాలి.. సినిమాలో ఫైట్స్ ఉండాలని భావిస్తుంటారు. కమర్షియల్ మూవీ అంటే ఎక్కువగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేది కాబట్టి.. వారు ఇవే కోరుకుంటారని.. అవి లేకపోతే సినిమాలు ఆడవని అనుకునే ఫిలిం మేకర్స్ ఉన్నారు.

అందుకే కథకు అవసరం లేకపోయినా అలాంటి అంశాలను జోడిస్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ పాత్రను సృష్టించి సన్నివేశాలను అల్లుకుంటారు. అదనంగా గ్లామర్ యాడ్ అవడంతో పాటుగా.. మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుంది కనుక అందరూ ఇదే ఫాలో అవుతూ వస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్లు లేకుండా రూపొందించిన సినిమాలు చాలా అరుదనే చెప్పాలి. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో అసలు జోడీ లేకుండా సినిమాలు చేస్తారని ఎవరూ ఊహించరు. కానీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలలో హీరోయిన్ లేకుండానే వస్తున్నారు చిరు.

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. ముందుగా ఇందులో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకొని.. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు. ఈ విషయం మీద మేకర్స్ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

ఆచార్య కు హీరోయిన్ని పెట్టి రొమాన్స్ చేయించడం వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో.. కాజల్ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోతున్నామనే కారణంతో ఆమెను తీసేయాల్సి వచ్చిందని దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అంటే ఈ చిరంజీవికి జోడిగా హీరోయిన్ లేకుండానే ఈ శుక్రవారం 'ఆచార్య' సినిమా విడుదల కాబోతోంది.

ఇక మెగాస్టార్ ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ''గాడ్ ఫాదర్''. ఇది మలయాళ 'లూసిఫర్' చిత్రానికి రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేశారు. అయితే ఒరిజినల్ లో మాదిరిగానే ఇందులో హీరో క్యారక్టర్ కు హీరోయిన్ లేదని తెలుస్తోంది.

నయనతార కీలక పాత్ర పోషిస్తోంది కానీ.. అది హీరోయిన్ పాత్ర కాదు. 'గాడ్ ఫాదర్' అనేది పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. చిరు మిడిల్ ఏజ్ మ్యాన్ క్యారక్టర్ లో కనిపిస్తారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలను బట్టి ఈ విషయం అర్థం అవుతుంది. అంటే రాబోయే రెండు సినిమాలలో చిరు కు జోడీ లేదు.

ఈ నేపథ్యంలో చిరంజీవి పక్కన హీరోయిన్ లేకపోతే వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. స్టోరీ ఎలా ఉన్నా మెగాస్టార్ కు హీరోయిన్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.. అమ్మడుతో లెట్స్ డు కుమ్ముడు అంటేనే వారికి కిక్ ఎక్కుతుంది. కానీ ఇప్పుడు 'ఆచార్య' తో పాటుగా 'గాడ్ ఫాదర్' సినిమాలలో హీరోయిన్ లేదు.

అభిమానుల అభిరుచికి తగినట్టుగా చిరూకి జోడీని సెట్ చేస్తే స్టోరీ దెబ్బ తింటుందని కొరటాల.. సినిమాలో హీరోయిన్ పాత్రను తొలగించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో అలాంటి రోల్ కు అవకాశమే లేదు. మెగాస్టార్ తన ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని అలాంటి స్క్రిప్టులు ఎంచుకుంటున్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి.

కాకపోతే 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ లేకపోయినా.. గ్లామర్‌ కేమీ లోటు లేదు. రామ్ చరణ్ కు జోడీగా నీలాంబరి క్యారెక్టర్ లో పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ నటించింది. వీరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లే కాదు.. ఒక సాంగ్ కూడా ఉంది. అలానే 'సానా కష్టం' అనే ఐటమ్ సాంగ్ లో రెజీనా కసాండ్రా హాట్ హాట్ గా కనిపించనుంది. మరి 'గాడ్ ఫాదర్' లో గ్లామర్ కోసం మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

అయితే ఆ తర్వాత చిరంజీవి నుంచి వచ్చే రెండు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భోళా శంకర్' చిత్రంలో తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపించనుంది. అలానే బాబీ డైరెక్షన్ లో చిరు నటిస్తున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేయనుంది. సో రెండు చిత్రాల్లో చిరు కు హీరోయిన్ లేకపోయినా.. ఆ తర్వాత రాబోయే సినిమాల్లో మాత్రం జోడీగా హీరోయిన్ ఉండబోతోందన్నమాట.
Tags:    
  • CommercialMovies 
  • Tollywood 
  • MegastarChiranjeevi 
  • Acharya 
  • KajalAgarwal 
  • KoratalShiva 
  • Ramcharan 
  • GodFather 

Similar News

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS