లిక్‌ క్లిక్‌ : కొణిదెల వారింట మొదలైన పెళ్లి పనులు

Update: 2020-08-19 10:10 GMT
కరోనా లాక్‌ డౌన్‌ టైమ్‌ అయినా కూడా సినిమా పరిశ్రమలో పెళ్లిలు మాత్రం ఆగడం లేదు. మాములుగా కంటే ఈ సీజన్‌ లో కొన్ని ఎక్కువ పెళ్లిలు అవుతున్నట్లుగా అనిపిస్తుంది. షూటింగ్స్‌ లేవు మరే పనులు లేని కారణంగా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది అనుకుంటున్నారో లేదంటే మరేంటో కాని వరుసగా స్టార్స్‌ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. గత ఏడాది కాలంగా నిహారిక పెళ్లి గురించి మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. చివరకు ఆమె చైతన్యను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది.

నిశ్చితార్థం పూర్తి అవ్వగా పెళ్లిని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా కొణిదెల వారి ఇంట జరిగిన కార్యక్రమం చూస్తుంటే పెళ్లి త్వరలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. సాదారణంగా పెళ్లి పనులు మొదలు పెట్టడం కోసం పసుపు కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. పసుపు కొట్టడంతో పెళ్లి పనులు ప్రారంభం అయినట్లుగా భావిస్తారు. పసుపు కొట్టడం పూర్తి అయ్యింది కనుక పెళ్లి కూడా కొన్ని రోజుల్లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక పసుపు కొట్టే కార్యక్రమంలో కొణిదెల వారి కుటుంబంకు చెందిన లేడీస్‌ అంతా పాల్గొన్నారు. నిహారిక తల్లితో పాటు చిరంజీవి భార్య మరియు మెగా సిస్టర్స్‌ ఇంకా చిరంజీవి ఇద్దరు కూతుర్లు నిహారిక స్నేహితురాల్లు ఇంకా కొందరు బంధు మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కలర్‌ ఫుల్‌ గా ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలో వైరల్‌ అవుతున్నాయి.
Tags:    

Similar News