• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `ఉప్పెన` నిర్మాత‌లతో మెగా...

`ఉప్పెన` నిర్మాత‌లతో మెగా మేన‌ల్లుడు బిగ్ డీల్

By - Tupaki Desk
Update: 2021-04-19 06:35 GMT
మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. డెబ్యూ హీరోల్లో చిన్న బడ్జెట్ చిత్రాలలో ఇటీవలి కాలంలో అతిపెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డుల‌కెక్కింది. హృతిక్-క‌హోనా ప్యార్ హై.. చ‌ర‌ణ్ -చిరుత‌.. అఖిల్- అఖిల్ -అఖిల్ చిత్రాల రికార్డుల్ని బ్రేక్ చేసింది.

ఉప్పెన స‌క్సెస్ అనంత‌రం వైష్ణవ్ తేజ్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. త్వరలో నటించబోయే రెండు చిత్రాలకు ఈ నటుడు సంతకం చేసినట్లు చెబుతున్నారు. ఉప్పెనను నిర్మించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్ తేజ్ తో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసిన వైష్ణవ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడ‌ట‌.

ఈ రెండు చిత్రాల‌కు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లను ఖరారు చేస్తార‌ని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుక్కూ ఈ చిత్రాలను నిర్మిస్తాడు. ప్రస్తుతానికి ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. చర్చలు జరుగుతున్నాయి.

వైష్ణవ్ తేజ్ ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని `కొండపొలం` షూటింగ్ పూర్తి చేసారు. ఈ చిత్రం త్వరలో విడుద‌ల కానుంది. అతను తన మూడవ చిత్రానికి గిరీశ‌య్య దర్శకత్వం వహిస్తాడు. బివిఎస్.ఎన్ నిర్మించే ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. కేతికా శర్మ ఇందులో క‌థానాయిక‌. వచ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.
Tags:    
  • Vaishnav Tej 
  • Kriti Shetty 
  • Uppena 
  • Tollywood 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS