• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ పోలీసోడిగా...

మళ్లీ పోలీసోడిగా మెరవనున్న మెగా హీరో.. కథ లీక్!

By - Tupaki Desk
Update: 2020-06-09 11:50 GMT
మెగా హీరో రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 ఆరంభంలో విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆఖరుకి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగా హీరో రాంచరణ్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇదివరకు కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసాడు. మరి ఇప్పుడు రాంచరణ్ సంగతి ఏంటని చర్చ నడుస్తుంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు జెర్సీ ఫేమ్ దర్శకుడు.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతునట్లు టాక్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.

అయితే రాంచరణ్ తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇండస్ట్రీలోని ఓ బడా నిర్మాత.. టాలీవుడ్ హిట్ మూవీ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చి రామ్ చరణ్ కోసం మంచి కథని సిద్ధం చేయించినట్లు తెలుస్తుంది. ఆ కథ పై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతుండగా.. చరణ్ నెక్స్ట్ మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేయనున్నాడని టాక్. అయితే ఆస్థికోసం ఓ పాపను వెంటాడే గ్యాంగ్ నుండి కాపాడే పోలీస్ అధికారిగా చరణ్ పాత్ర ఉంటుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా కమర్షియల్ జోనర్ లో ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని సమాచారం. అన్ని అనుకూలంగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట. మరి అసలు విషయాలు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Tags:    
  • Mega hero is going to Play police Role again 
  • Movie News 
  • lastest movies 

Similar News

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS