అరవింద సమేత మెగాహీరోలు

Update: 2019-01-21 14:30 GMT
మెగా ఫ్యామిలీ రైలు లాంటిది. ముందు ఇంజిన్‌ గా మెగాస్టార్‌ నిలబడితే.. ఆయన వారసులిగా దాదాపు 10 మందికి పైగా ఇండస్ట్రీకి వచ్చారు. అయితే.. అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. మెగాస్టార్‌ ఇంజిన్‌ అయినా.. ఆ ఇంజిన్‌ నడిపే డ్రైవర్‌ మాత్రం మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడంటే.. అతనికి డైరెక్టర్‌ ని ఎలా సెట్‌ చెయ్యాలి, ప్రొడక్షన్‌ హౌస్‌ ఏంటి, ఎలా ప్రమోట్‌ చెయ్యాలి లాంటి విషయాల్నింటిని చూసుకునేది అల్లు అరవిందే. అన్నింటికి మించి అల్లు అరవింద్‌ ని గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన బ్యానర్‌ లో ఇండస్ట్రీలో పరిచయం అయితే స్టార్‌ అయిపోయినట్లే. ఈ విషయాన్ని వైష్ణవ్‌ కొత్త సినిమా ఓపెనింగ్‌ లో అల్లు అరవిందే చెప్పారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అల్లు అర్జున్‌ ఫస్ట్‌ సినిమా గంగోత్రి. సాయి ధరమ్‌ ఫస్ట్‌ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం. ఈ మూడు సినిమాలు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందినవే. ఇక వైష్ణవ్‌ తేజ్‌ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందిన జానీ సినిమాలో చిన్నప్పటి పవన్‌ కల్యాణ్‌ గా కన్పించాడు వైష్ణవ్‌. దీంతో.. తన ద్వారా నలుగురు మెగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని గర్వంగా చెప్పుకున్నారు అల్లు అరవింద్‌.
Tags:    

Similar News