హేయ్! ఈయ‌నే స్టైలిష్‌ స్టార్-2

Update: 2018-12-26 01:30 GMT
``నాకు ఎవ‌రిని చూసినా అలా అనిపియ్య‌దు. క‌ళ్యాణ్ బాబు ఒక్క‌డిని చూస్తేనే అలా అనిపిస్తుంది.. స్టార్..! రియ‌ల్ స్టార్..  డ్యాన్సులేసిసినంత మాత్రాన‌.. స్టెప్పులేసేసినంత మాత్రాన‌.. ఫైట్స్ చేసేసినంత మాత్రాన.. పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పినంత మాత్రాన‌  స్టార్ అయిపోయారు``... అంత ఎమోష‌న‌ల్ గా ఆ మాట అన్న‌ది ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేల‌దేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న మేన‌మామ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అలా ప్రేమ కురిపించాడు. ఒకానొక సినిమా ఈవెంట్ లో బ‌న్ని ఎంతో ఎమోష‌న్ అయ్యి ప‌వ‌న్ ని  పొగిడేశాడిలా. అయితే అదే బ‌న్నీ ఆ త‌ర్వాత చెప్ప‌ను బ్ర‌ద‌ర్! అనేయ‌డంతో ఎంత ర‌చ్చ‌య్యిందో చెప్పాల్సిన ప‌నేలేదు. ప‌వ‌న్ అభిమానులు బ‌న్నిపై ఎంతో సీరియ‌స్ అయ్యారు.

అదంతా గ‌తం గ‌తః అనుకుంటే..  ఇప్పుడు మీకు `స్టైలిష్ స్టార్ 2`ని ప‌రిచ‌యం చేయాల్సిందే. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ యంగ్ బోయ్ అచ్చం బ‌న్నీనే పోలి ఉన్నాడు.మాట‌ల్లేవ్‌ మాట్లాడుకోడాల్లేవ్‌! అంటారా?.. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని చెబుతుంటారు. అందులో బ‌న్ని పోలిక‌ల‌తో ఏడుగురిలో ఈయ‌న ఒక‌డు అని చూడ‌గానే చెప్పేయొచ్చు. బ‌న్నిలాగే త‌ల‌కట్టు.. మీస‌క‌ట్టు.. ఆ ముక్కు.. క‌ళ్లు.. పెద‌వులు.. గ‌డ్డం.. త‌న‌లానే ఎక్స్‌ ప్రెష‌న్స్ ప్ర‌తిదీ మ్యాచ్ అవుతున్నాయి. వీట‌న్నిటినీ మించి మాట్లాడేప్పుడు ఆ చెయ్యి తిప్పుతున్న తీరు.. బాడీ లాంగ్వేజ్ కూడా అచ్చం బ‌న్నీలానే ఉంది.

దీంతో ఈ వీడియోకి బ‌న్ని అభిమానులు క‌నెక్ట‌యిపోతున్నారు. చూసేందుకు బాహుబ‌ల భుజ‌బ‌లేశ్వ‌రుడిలా ఉన్న ఈ యువ‌కుడు బ‌న్ని త‌ర‌హాలోనే కండ‌లు పెంచి టైట్ ఫిట్ నెక్ బ‌నియ‌న్ వేసి ఇమ్మిటేష‌న్ అద‌ర‌గొట్టేస్తున్నాడు. ``అల్లు అర్జున్ గారూ .. ఒక‌సారి చూడండి .. ఈ కుర్రాడు అచ్చం మీలానే ఉన్నాడు..`` అంటూ ఈ వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. వాయిస్ బ‌న్నీదే అయినా బాడీ, ఇమ్మిటేష‌న్ ఆ కుర్రాడిది. ఈ వీడియో యూత్ లో జోరుగానే వైర‌ల్ అవుతోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News