బ్యూటీతో బేక‌ర్: టీ తాగినా పిండి క‌లిపినా ఆమె త‌లపులేనా?

Update: 2021-09-04 04:32 GMT
ప్రేమ‌లో ప‌డిన పాపం పసోడి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలా!.. టీ తాగినా .. పిండి క‌లిపినా .. బేకింగ్ చేస్తున్నా ఆమె త‌ల‌పులు వెంటాడే ప‌రిస్థితి ఉంటుంది మ‌రి. అంత‌గా గ‌మ్మ‌త్త‌యిన ట్రీటిచ్చే ఆ అందం ఎవ‌రో కానీ .. సంతోష్ శోభ‌న్ వ్య‌థ చూస్తుంటే జాలి వేయ‌కుండా ఉండ‌దు.

ఆహా వీడియో కొత్త ఒరిజినల్స్ లో ఈ మ్యాజిక‌ల్ ల‌వ్ డ్రామా త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానుంది. సంతోష్ శోభన్ -టీనా శిల్పరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన `ది బేకర్ అండ్ ది బ్యూటీ` తెలుగు ఓటిటి ఆహాలో ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా టీజర్ విడుద‌లై యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటోంది. బేకింగ్ వృత్తిలో ఉన్న ఆ కుర్రాడి హృద‌యాన్ని దోచిన ఆ యువ‌తి అంద‌చందాలు యూత్ కి ఇట్టే క‌నెక్ట‌యిపోతున్నాయి.  

టీజ‌ర్ ఆద్యంతం ఎంతో ఆహ్లాద‌మైన ప్రేమ‌క‌థ క‌నిపిస్తోంది.నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. విభిన్నమైన వృత్తుల నుంచి అమ్మాయి అబ్బాయి క‌లుసుకున్నాక ఏం జ‌రిగింది? అన్న‌దే థీమ్. క్యాప్ష‌న్ కి త‌గ్గ‌ట్టే ల‌వ్ ఎమోష‌న్ .. క‌ష్టాలు కన్నీళ్లు అన్నిటినీ తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. బేకర్ అండ్ ది బ్యూటీ ఈ నెల 10 న ఆహా వీడియోలో ప్రీమియర్ కి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాకి జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.


Full View
Tags:    

Similar News