ఆయన దు:ఖంను చూస్తే గుండె బద్దలవుతోంది : మీరా చోప్రా

Update: 2020-08-05 14:30 GMT
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి కేసు మలుపులు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది. ముంబయి పోలీసులు విచారణ జరిపినన్ని రోజులు ఆయనది ఆత్మహత్యగా అంతా అనుకున్నారు. ఆఫర్లు లేక డిప్రెషన్‌ తో చనిపోయాడేమో అనుకున్నారు. కాని ఎప్పుడైతే సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడో అప్పటి నుండి రియా చక్రవర్తి గురించిన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేకే సింగ్‌ మూడు రోజుల క్రితం విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో చాలా మంది సుశాంత్‌ కేసు విషయంలో న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఫిబ్రవరిలోనే ముంబయి పోలీసులకు తాను సుశాంత్‌ గురించి చెప్పాను. ఆ సమయంలోనే రియాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదు అంటూ కేకే సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోలో ఆయన కన్నీరు పెట్టుకోవడంపై హీరోయిన్‌ మీరా చోప్రా స్పందించింది. 74 ఏళ్ల ఒక వృద్ద తండ్రి తన కొడుకును కోల్పోయాడు. ఈ సమయంలో ఆయన తనకు న్యాయం కావాలని కోరుతున్నారు. కొడుకును ఎలాగూ పొందలేరు. కనీసం ఆయన న్యాయం అయినా పొందలేరా అంటూ ఆమె ప్రశ్నించింది. ఆమె ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

సుశాంత్‌ కేసు ఇప్పుడు సీబీఐకి చేరింది. కేంద్ర ప్రభుత్వంకు బీహార్‌ సీఎం సిఫార్సు చేయడంతో సీబీఐకి కేసును అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముంబయి పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావు ఇచ్చింది. ఇప్పుడు సీబీఐకి కేసు చేరడంతో సుశాంత్‌ మృతిపై ఉన్న అనుమానాలకు సమాధానం లభిస్తుందని అభిమానులు మరియు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Tags:    

Similar News