బంగారం భామకు పవన్‌ తో తొక్కిసలాటేనట

Update: 2016-05-03 17:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బంగారంతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన మీరా చోప్రా.. ఇప్పుడు పవన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పవన్ తో పని చేయడం చాలా కష్టం అని తేల్చేసింది మీరా చోప్రా. ఇందుకు కారణం కూడా సుదీర్ఘంగానే చెప్పింది. బంగారం మూవీ చేసేటపుడు తనకు ఎదురైన అనుభవాల కారణంగానే ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పింది మీరా.

"ఏపీలో పవన్ కళ్యాణ్ తో పని చేయడం చాలా కష్టం. అక్కడ ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది" అంటున్న మీరా చోప్రా.. తమిళనాడులో పొలాచ్చిలో జరిగిన ఘటనను వివరించింది. "బంగారం దర్శకుడు తమిళనాడులోని పొలాచ్చిలో షూటింగ్ ప్లాన్ చేశాడు. ఏపీలో పవన్ తో షూటింగ్ అంటే కష్టం కావడమే ఇందుకు కారణం. అయితే పొలాచ్చిలో హోటల్స్ ఉండవు. అందుకే మేమంతా ఓ చిన్న గెస్ట్ హౌజ్ లోనే ఉన్నాం. అక్కడికి పవన్ వచ్చాడని తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చేశారు. దాదాపు 10వేల మంది గెస్ట్ హౌజ్ చుట్టూ మూగిపోయారు. 2 రోజుల పాటు ఆయన కనీసం కాలు బయటపెట్టలేకపోయారు"  అంటూ బంగారం రోజులను గుర్తు చేసుకుంది మీరా చోప్రా.

"నేను న్యూయార్క్ లో పెరిగాను. ఇండియాలో స్టార్ హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు కానీ.. సౌత్ కి వచ్చినపుడే దీన్ని ప్రత్యక్షంగా చూశాను" అని చెప్పింది మీరా చోప్రా. ప్రస్తుతం ఈ భామ 1920 లండన్ అనే హిందీ హారర్ మూవీ చేస్తోంది.
Tags:    

Similar News