రొమాన్స్ పై యాంకర్ కి మారుతి పంచ్

Update: 2016-05-23 05:40 GMT
యాంకర్లు.. ముఖ్యంగా ఆడియో ఫంక్షన్స్ ను హోస్ట్ చేసే యాంకర్లు ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నారు. ఎదురుగా వేలకొద్దీ అభిమానులు, పదుల కొద్దీ సెలబ్రిటీలు దర్శనమిచ్చేసరికి నోటికొచ్చిన ప్రశ్నలను అడిగేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు. సమాధానం చెప్పలేని ప్రశ్నలను అడగడమే గొప్ప కింద యాంకర్లు భావించడం.. మరీ టూమచ్ గా అనిపిస్తోంది.

జెంటిల్మన్ ఆడియో ఫంక్షన్ లో ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ తర్వాత.. యాంకర్ శ్రీముఖికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. వరుసగా సెలబ్రిటీలను అందరినీ తమ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్ గురించి అడగమని మరో యాంకర్ రవిని వాళ్ల దగ్గరకు పంపింది. అల్లరి నరేష్ - రాణా - అవసరాల.. ఇలా కొందరిని ఇబ్బంది పెట్టడం అయిపోయాక.. చివరకు మైక్ దర్శకుడు మారుతి దగ్గరకు వచ్చింది.

మొదట కొంచెం ఇబ్బంది పడ్డ మారుతి ఆ తర్వాత తేరుకుని.. 'అసలు మీరడుగుతున్న ప్రశ్నలేంటి? ఇలా ఇంతమంది ముందు ఎవరైనా రొమాన్స్ గురించి అడుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా?' అన్న మారుతి.. రవిని రమ్మని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని' నీ రొమాన్స్ గురించి చెప్పు.. ఎప్పుడు చేశావ్? ఎవరితో చేశావ్? ఎన్నిసార్లు చేశావ్? చెప్పు' అనడంతో యాంకర్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. రవి ఏదో ఆన్సర్ ఇస్తుంటే.. అది డబుల్ మీనింగ్ ధ్వనించేసరికి.. 'ఇక చాలు.. ఇప్పటికే చాలా అర్ధాలు వచ్చేశాయి. వెళ్లి పని చూసుకో.. ఇలాంటి ప్రశ్నలు అడక్కండి.' అంటూ క్లాస్ పీకేశాడు మారుతి.

మొత్తం ఎపిసోడ్ లో వాళ్ల క్వశ్చన్స్ కంటే.. మారుతీ యాంకర్స్ కి వేసిన పంచ్ సూపర్బ్ గా అదిరింది.
Tags:    

Similar News