• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దిల్ రాజుకు మణిరత్నం కథ...

దిల్ రాజుకు మణిరత్నం కథ చెప్పిన వేళ..

By - Tupaki Desk
Update: 2016-11-13 11:30 GMT
మణిరత్నం స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తమిళంలో తీసే సినిమాల్ని కళ్లకద్దుకుని తెలుగులోకి తీసుకుంటారు మన నిర్మాతలు. ఇందుకోసం ఆయన కథ చెప్పాల్సిన పని లేదు. రషెస్ చూపించాల్సిన అవసరమూ లేదు. ప్రివ్యూ కూడా వేయాల్సిన పని లేదు. ఐతే ఇంతకుముందు ఏం జరిగిందో కానీ.. దిల్ రాజు విషయంలో మాత్రం మణిరత్నం చూపించిన ప్రత్యేక శ్రద్ధ.. ఆయనకు ఇచ్చిన గౌరవం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్ రాజుకు తెలుగులో ఉన్న రెపుటేషన్ తెలుసుకుని.. ఆయన తన గత సినిమా ‘ఓకే బంగారం”తో పాటు తాజా సినిమా ‘డ్యూయెట్” కథను కూడా షూటింగ్ ఆరంభం కావడానికి ముందే చెప్పాడట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు.

మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ తనకు కథ చెప్పడం గౌరవంగా భావిస్తున్నాని.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘డ్యూయెట్” షూటింగ్ ఆరంభం కావడానికి ముందే తనకు స్టోరీ నరేట్ చేశాడని దిల్ రాజు వెల్లడించాడు. ఇంతకుముందు ‘ఓకే బంగారం” విషయంలోనూ తనకు మణిరత్నం నరేషన్ ఇచ్చాడని దిల్ రాజు తెలిపాడు. ‘ఓకే బంగారం” సినిమాను దిల్ రాజు ప్రమోట్ చేసి.. చక్కగా రిలీజ్ చేసిన తీరు మణిరత్నంకు బాగా నచ్చిందని సమాచారం. అందుకే తన కొత్త సినిమాను కూడా దిల్ రాజుకు తక్కువ రేటుకే ఇచ్చాడట. కార్తి-మణి కాంబినేషన్లో తెరకెక్కిన ‘డ్యూయెట్” మీద పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ఈసారి రిలీజ్ కొంచెం భారీగానే చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Maniratnam 
  • Duet Movie 
  • Dil Raju 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS