మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పటికి మోక్షం?
రకరకాల కారణాలతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ల ఎంపిక విషయంలోనే దర్శకమణి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు సినిమా ప్రారంభించారు అనుకోగానే.. మహమ్మారీ క్రైసిస్ మొదలైంది. ఒక మూవీ కోసం ఆయన ఇన్నేళ్ల పాటు ఇంత ఓపిగ్గా వేచి చూడడం అన్నది ఇదే మొదటి సారి కావచ్చు.
`పొన్నియిన్ సెల్వన్` ఎట్టకేలకు సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి ప్రారంభమవుతుంది. ఈ మూవీ గత సంవత్సరం థాయ్ లాండ్ లో ప్రారంభం కాగా.. జనవరిలో మొదటి షెడ్యూల్ ను ముగించారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఫార్మాలిటీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
తాజాగా పొన్నిన్ సెల్వన్ షూట్ కి సంబంధించిన సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభమవుతోంది. చిత్రబృందం మొదట పొల్లాచి మైసూర్ లో షూటింగ్ చేయనుంది. తదుపరి ప్రధాన షెడ్యూల్ కోసం శ్రీలంకకు వెళుతుంది.
`పొన్నియిన్ సెల్వన్` (సేమ్ టైటిల్) పురాణేతిహాస నవల ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. ఈ చిత్రంలో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్- కార్తీ- జయం రవి- త్రిష- జయరామ్- ఆధీ- విక్రమ్ ప్రభు- ఐశ్వర్య లక్ష్మి ఇతర ముఖ్య పాత్రలలో నటించనున్నారు. ఐశ్వర్యారాయ్ ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో సర్ ప్రైజ్ చేయనున్నారు. టాప్ టెక్నీషియన్లు భారీ తారాగణంతో పాన్-ఇండియా కేటగిరిలో ఈ మూవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలని మణిరత్నం వేచి చూస్తున్నారు.