• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ కు మంచు విష్ణు...

కోలీవుడ్ కు మంచు విష్ణు ఫ్లాప్ సినిమా

By - Tupaki Desk
Update: 2021-12-12 01:30 GMT
ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా గెలుపొంది `మా` అసోసియేష‌న్ ప‌గ్గాలు స్వీక‌రించిన హీరో మంచు విష్ణు ప్ర‌స్తుతం శ్రీ‌ను వైట్ల రూపొందిస్తున్న `ఢీ అండ్ ఢీ` (డ‌బుల్ డోస్‌) మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఓ ప‌క్క నిర్మాత‌గా తండ్రి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు తో `స‌న్ ఆఫ్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తున్న మంచు విష్ణు మూడేళ్ల క్రితం విడుద‌లై తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాతో త‌మిళ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.

మూడేళ్ల క్రితం అంటే 2019 లో మంచు విష్ణు హీరోగా న‌టించ‌గా విడుద‌లైన చిత్రం `ఓట‌ర్‌`. జీ.ఎస్ . కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూన్ 21న విడుద‌లై దారుణ ఫ‌లితాన్ని చ‌విచూసింది. మంచు విష్ణు చిత్రాల్లో అత్యంత డిజాస్ట‌ర్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇదే చిత్రాన్ని దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత త్వ‌ర‌లో త‌మిళంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. త‌మిళంలో ఈ చిత్రానికి `కుర‌ల్ 388` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఓట‌ర్ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న నేపథ్యంలో ఈ చిత్రాన్ని పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందించారు.

ఓటు సామాన్యుడి చేతిలో వ‌జ్రాయుధం అని చెప్పే క‌థ‌నంతో రూపొందిన ఈ మూవీ తెలుగులో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక త‌మిళంలో ఆక‌ట్టుకునేనా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలోని త‌న పాత్ర‌కు మంచు విష్ణు స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. ఈ చిత్రంలో సుర‌భి హీరోయిన్ గా న‌టించింది. సంప‌త్ రాజ్‌,పోసాని కృష్ణ ముర‌ళీ, నాజ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.
Tags:    
  • Mancu Vishnu 
  • MAA 
  • maa association 
  • Voter 
  • Kollywood 
  • Surabhi 
  • Mohan Babu 
  • son of india 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS