కన్నప్ప కథ ఏమైంది విష్ణూ?

Update: 2015-07-16 07:34 GMT
మంచు విష్ణు ఓ ఇద్దరికి రెండు వాగ్ధానాలు చేశారు. ఆ రెండూ అతడి మెడకి ఉచ్చులాంటివే. అయితే ఆ వాెగ్ధానాలు ఎప్పటికి నెరవేరుతాయో చెప్పలేని పరిస్థితి. ఎప్పటికైనా తీర్చాల్సిన వాగ్ధానాలివి. ముఖ్యంగా మహానటుడు, దర్శకరచయిత తనికెళ్ల భరణికి ఓ వాగ్ధానం ఇచ్చాడు. అతడి దర్శకత్వంలో 'కన్నప్ప కథ' అనే చిత్రంలో నటిస్తానని. అయితే ఆ సినిమాకి సంబంధించిన ఒక్క వివరమూ ఆ తర్వాత బైటికి రాలేదు. భరణి ఇంతకాలం వేచి చూసి ఇక ఓపిక లేక వేరొక హీరోని వెతుక్కుని మరో కొత్త సినిమాకి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

మంచు విష్ణు ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో డైనమైట్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఒకవేళ ఇది అయ్యాక అయినా భరణితో ముందుకు వెళ్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. అలాగే విష్ణు వేరొకరికి వేరొక హామీ కూడా ఇచ్చాడు. శ్వేతబసు ప్రసాద్‌ వ్యభిచారం ఉచ్చులో చిక్కుకుని జైలుకి వెళ్లినప్పుడు తనకి బాసటగా నిలుస్తూ .. శ్వేత ఊ అనాలే కానీ తనతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నా అని ప్రకటించాడు. కాబట్టి అది బీరాలు పోవడం వరకే పరిమితం అని బ్యాడ్‌నేమ్‌ తెచ్చుకోకుండా విష్ణు నిజాయితీ ఉన్న హీరో కం నిర్మాత అని నిరూపించుకోవాలంటే ఆ ప్రామిస్‌లను నిజం చేయాల్సి ఉంటుంది. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. అంతవరకూ వెయిట్‌ అండ్‌ సీ
Tags:    

Similar News