అల్ట్రా- లోకల్ ఫార్ములా తో చరణ్ మరో అద్భుతం!
`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
`ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత చరణ్ అంతా ఊహించినట్లుగా హాలీవుడ్ శైలి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్స్‌కో? లేదా? భారీ విజువల్ ఎఫెక్ట్స్ హంగులున్న సైన్స్ ఫిక్షన్ కథలకో పరిమితం కాలేదు. ఆ గ్లోబల్ ఇమేజ్‌ను పక్కన పెట్టి చరణ్ మళ్లీ మట్టి వాసన ఉన్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎమోషన్స్ వైపే మొగ్గు చూపడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ వ్యూహంలో భాగమే దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ `పెద్ది` లో నటించారు. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో, క్రీడా నేపధ్యం కలిగిన ఎమోషనల్ అల్ట్రా-లోకల్ డ్రామాగా రూపొందిన చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరించింది. అంతటి గ్లోబల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో? ఏమాత్రం తడబడకుండా ఇంతటి సహజ సిద్ధమైన.. రూటెడ్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన కథల ఎంపికపై ఉన్న స్పష్టతకు అద్దం పడుతోంది. తాజాగా ఈ సిరీస్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కాంబినేషన్ కూడా మళ్లీ పక్కా లోకల్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, మట్టివాసన ఉన్న కథతోనే రాబోతోందని టాలీవుడ్ టాక్. అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కిన తరుణంలో హాలీవుడ్ తరహా స్టైలిష్ కంటెంట్‌ను కాదని అల్ట్రా-లోకల్ రూటెడ్ ఎమోషన్స్ వైపే మళ్లీ అడుగులు వేయడం వెనుక బలమైన కమర్షియల్ వ్యూహం దాగి ఉంది.
ఎంత లోకల్ గా ఉంటే సినిమా అంత గ్లోబల్ అవుతుంది? అనే ఆధునిక చలనచిత్ర సూత్రాన్ని రామ్ చరణ్ బలంగా నమ్ముతున్నట్లు లైన్-అప్ స్పష్టం చేస్తోంది. గ్లోబల్ ఆడియన్స్‌కు వెస్ట్రన్ తరహా యాక్షన్ స్టంట్స్ కొత్తేమీ కాదు. కానీ భారతీయ గ్రామీణ సంస్కృతి, ఇక్కడి భావోద్వేగాలు, నేటివిటీ వారికి సరికొత్త అనుభూతినిస్తాయి.
'ఆర్ ఆర్ ఆర్' లోని 'నాటు నాటు' పాట అంతర్జాతీయంగా హిట్ అవ్వడానికి కారణం కూడా అందులొ పక్కా నాటు ఎనర్జీయే కావడం గమనార్హం. ఈ రూటెడ్ కథల వెనుక ఉన్న కమర్షియల్ బిజినెస్ స్ట్రాటజీని గమనిస్తే లోకల్ ఎమోషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ భాషా ప్రేక్షకుడికైనా కనెక్ట్ అవుతాయి. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను అనుకరించడం కంటే దేశపు ఆత్మ లాంటి పల్లెటూరి కథలను, బలమైన డ్రామాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించినప్పుడు అది నిజమైన గ్లోబల్ కంటెంట్‌గా మారుతుంది. రామ్ చరణ్ యాక్షన్ హీరోగానే కాకుండా పెర్ఫార్మర్‌గా ప్రపంచ మార్కెట్‌లో తన బ్రాండ్‌ను సుస్థిరం చేసుకోవడానికి ఈ అల్ట్రా-లోకల్ స్ట్రాటజీ ఎంతో దోహదపడుతుంది.
గ్లోబల్ క్రేజ్ దక్కిన తర్వాత రూట్ మార్చకుండా మూలాలను నమ్ముకుని మట్టి వాసన ఉన్న కథలతోనే ప్రపంచాన్ని జయించవచ్చని రామ్ చరణ్ నిరూపిస్తున్నారు. టెక్నాలజీ, బడ్జెట్ పరంగా హాలీవుడ్‌ను మ్యాచ్ చేయడం కంటే కంటెంట్ , రూటెడ్ ఎమోషన్స్ పరంగా ప్రత్యేకతను చాటడమే సరైన మార్గమని చరణ్ సెలెక్షన్ రుజువు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అల్ట్రా-లోకల్ ఫార్ములా టాలీవుడ్‌ను మరిన్ని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.