• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ కు విశాఖ ఉక్కు...

టాలీవుడ్ కు విశాఖ ఉక్కు సెగ.. మంచు హీరోని అడ్డుకున్న ఉద్యమకారులు..!

By - Tupaki Desk
Update: 2021-03-13 03:19 GMT
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడానికి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి - నారా రోహిత్ - సుధీర్ బాబు - కోన వెంకట్ - కత్తి మహేష్ వంటి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. అయితే మిగతా సినీ ప్రముఖులెవరూ దీనిపై స్పందించకపోవడంపై ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు సెగ తగిలింది.

'మోసగాళ్లు' మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు తన టీమ్ తో కలిసి ఈరోజు వైజాగ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు విష్ణును అడ్డుకుని.. ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని... లేకపోతే సినిమా షూటింగులు సినిమా ఫంక్షన్స్ కోసం వైజాగ్ కు సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలు ప్లాంటును లాభాల్లో నిర్వహిస్తామని చెపుతున్నప్పుడు.. అది ప్రభుత్వానికి ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందని.. కానీ రాజకీయ కారణాలతో ఎవరూ ముందుకు రావడం లేదని ఈ సందర్భంగా విష్ణు అభిప్రాయపడ్డారు. ఇకపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Tags:    
  • Manchu Vishnu 
  • VSP movement 
  • Vizag Steel Plant 
  • Telugu News 

Similar News

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS