మంచు మనోజ్ 25000 కుటుంబాల‌కు సాయం

Update: 2021-05-20 04:41 GMT
సెకండ్ వేవ్ విల‌యం తీవ్ర‌త‌ను అర్థం చేసుకున్న సెల‌బ్రిటీలు ఎవ‌రికి వారు త‌మ వంతు సాయానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు మంచు మ‌నోజ్ వంతు. హీరో మంచు మనోజ్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే బ‌ర్త్ డే వేడుకలకు ఆయ‌న‌ దూరంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రోజున ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. COVID-19 బారిన పడ్డ 25 వేల కుటుంబాలకు 13 ర‌కాల‌ వేర్వేరు గృహ నిత్యావసరాలను అందిస్తాన‌ని మనోజ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ గొప్ప మిషన్ లో మనోజ్ తో అతని అభిమానుల బృందం చేరారు.

క‌రోనాని గుర్తించడంలో మానవత్వాన్ని పరిరక్షించడంలో తమ వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెట్టినందుకు ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ మనోజ్ ప్రత్యేక గమనికలో ధన్యవాదాలు తెలిపారు. మాస్కులు ధరించడం.. క్రమం తప్పకుండా శుభ్రపరచడం.. శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా తమను తాము మెరుగుప‌రుచుకోవాల‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మ‌నోజ్ కోరారు.

మెగాస్టార్ చిరంజీవి .. అల్లు అర్జున్.. ప్రభాస్.. నితిన్..  స‌హా ప‌లువురు కోవిడ్ బాధితుల‌ను ఆదుకునేందుకు అవ‌స‌ర‌మైన సాయానికి ముందుకు రావ‌డం తెలిసిన‌దే. కొంద‌రు హీరోలు సీఎం నిధికి డొనేష‌న్లు ఇచ్చారు. టాలీవుడ్ హీరోల‌ ఫ్యామిలీస్ నుంచి పేద‌లు క‌ష్టంలో ఉన్న‌వారికి అంతో ఇంతో సాయం అందుతోంది. మాన‌వ‌త వెల్లివిరుస్తోంది.
Tags:    

Similar News