రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్: చిన్న తమ్ముడితో ఇలా..

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత ఆయనకు వస్తున్న బర్త్ డే విషెస్ రేంజ్ కూడా మారిపోయింది.;

Update: 2026-03-27 04:31 GMT

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత ఆయనకు వస్తున్న బర్త్ డే విషెస్ రేంజ్ కూడా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ వ్యక్తిత్వం మంచితనం గురించి తెలిసిన వారంతా ఈ రోజును ఒక పండుగలా జరుపుకుంటున్నారు.

​ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నిన్ననే సెట్స్ కు వచ్చిన అభిమానులను కలిసి తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. గాయం నుంచి కోలుకుని ఆయన మళ్ళీ ఫామ్ లోకి రావడం చూస్తుంటే ఈ ఏడాది చరణ్ కెరీర్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది.

​ఈ పుట్టినరోజు వేడుకల్లో ఒక ఆసక్తికరమైన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో చరణ్ కలిసి ఉన్న ఒక అన్ సీన్ ఫోటోను ఆమె షేర్ చేశారు. "మార్క్ అలాగే మా అందరి తరపున చరణ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చరణ్ ఎప్పుడూ బలంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

​ఈ ఫోటోలో చరణ్ పక్కన కూర్చుని మార్క్ ఫోన్ చూస్తుంటే, చరణ్ కూడా ఎంతో ప్రేమగా తమ్ముడిని గమనిస్తున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కుటుంబంతో చరణ్ కు ఎంతటి అనుబంధం ఉందో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతోంది. సాధారణంగా పవన్ పిల్లలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడం చాలా తక్కువ. అలాంటిది చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ క్యూట్ పిక్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బ్రదర్స్ మధ్య ఉండే ఈ బాండింగ్ ను చూసి నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

​కెరీర్ పరంగా చరణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. 'గేమ్ ఛేంజర్' ఫలితం తర్వాత ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తున్నారు. 'పెద్ది' సినిమా కోసం మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో గొప్పగా చర్చించుకుంటున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో 'పెద్ది' సినిమాకు సంబంధించిన ఏదైనా క్రేజీ అప్ డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



Tags:    

Similar News