12 నిమిషాలు... మంచు లక్ష్మి కొత్త ఛాలెంజ్
సోషల్ మీడియాలో ఈమద్య కాలంలో చాలా ఛాలెంజ్ లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో వచ్చిన ఛాలెంజ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుకింగ్ చాలెంజ్ నుండి మొదలుకుని క్లీనింగ్ ఛాలెంజ్ వరకు ఎన్నో ఛాలెంజ్ లను సోషల్ మీడియాలో మనం చూశాం. ఇప్పుడు కొత్త ఛాలెంజ్ ను మంచు లక్ష్మి ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉంది. ఆమె ఇటీవల వ్యక్తిగతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను షురూ చేసింది. ఆ యూట్యూబ్ ఛానెల్ లో తన ఇంటి ని చూపించడం మొదలుకుని పలు విషయాలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది. పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మంచు లక్ష్మి ప్రతి వీడియోకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. తాజాగా మేకప్ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియోను షేర్ చేసింది.
ఆడవారు మేకప్ ను గంటలకు గంటలు వేసుకుంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ముఖ్యంగా మగవారు ఆడవారి మేకప్ విషయంలో చాలా జోకులు వేసుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయం మేకప్ కు అవసరం లేదని.. చాలా అందంగా తక్కువ సమయంలో కూడా రెడీ అవ్వొచ్చు అంటూ మంచు లక్ష్మి నిరూపించే ప్రయతనం చేసింది. మేకప్ ఛాలెంజ్ లో భాగంగా మంచు లక్ష్మి తాను మేకప్ అయ్యింది. కేవలం 12 నిమిషాల్లో తన మేకప్ ఆర్టిస్టు సాయంతో రెడీ అయ్యింది. తక్కువ సమయంలోనే మేకప్ అయ్యాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
12 నిమిషాల్లో రెడీ అయిన మంచు లక్ష్మి తన లుక్ గురించి కామెంట్ చేయమంది. మొత్తానికి 12 నిమిషాల్లోనే మేకప్ అయినా చాలా అందంగా వచ్చింది అంటూ ఆమె తనను తాను అభినందించుకుంది. ఆమె మేకప్ ఆర్టిస్టు ను కూడా తక్కువ సమయంలో మేకప్ చేసినందుకు గాను అభినందించింది. యూట్యూబ్ లో మంచు లక్ష్మి మేకప్ ఛాలెంజ్ ను చాలా మంది చూసి ట్రెండ్ చేస్తున్నారు. నటిగా నిర్మాతగా హోస్ట్ గా చేసి మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తుంది. వాటికి సంబంధించిన విషయాలు బయటకు రాలేదు. త్వరలోనే ఆమె నటించిన ప్రాజెక్ట్ లు ప్రేక్షకుల ముందుకు వస్తాయేమో చూడాలి.
Full View