కమల్-రజనీకాంత్ దృష్టిలో అనీల్ రావిపూడి!
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి ఓ భారీ మల్టీస్టార్ కు రెడీ అయితే సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి ఓ భారీ మల్టీస్టార్ కు రెడీ అయితే సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలు తొలుత లోకేష్ కనగరాజ్ కు అప్పగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ లోకేష్ చెప్పిన కథ ఇద్దర్నీ ఎంగేజ్ చేయలేదు. తన శైలి యాక్షన్ స్టోరీని ఇద్దరికి వేర్వేరుగా నేరేట్ చేసాడు. కానీ కనెక్ట్ అవ్వలేదు. దీంతో కాంబినేషన్ సిద్దంగా ఉన్న డైరెక్టర్ రెడీగా లేకపోయాడు. అయితే కమల్-ద్వయం ఎలాంటి స్టోరీలో కనిపించా లనుకుంటున్నారు? అన్నది ఇంతవరకూ సరైన క్లారిటీ లేదు. ఇద్దరు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న నటులు.
అలాంటి వారి కోసం స్టోరీ అంటే? అదే రేంజ్ లో ఉండాలి. యూనివర్శల్ గా ఆ కథ ఉండాలి? అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ కమల్ -రజనీకాంత్ అందుకు భిన్నంగా ఉన్నారు అన్నది తాజాగా లోకేష్ కనగరాజ్ మాటల్లో క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు లైట్ హార్టెడ్ సినిమా చేయాలనుకుంటున్నారన్నారు. యాక్షన్ కథల్లో నటించి వారికి బోర్ కొట్టి ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ లో నటించే ఆసక్తితో ఉన్నట్లు లోకేష్ మాటల్లో అర్దమైంది. అందుకు లొకేష్ ఎంత మాత్రం సెట్ కాని దర్శకుడు. అందుకే తానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
అలాంటి కథలు రాయడం తనకు చేతకాదని ఓపెన్ గానే ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు లెజెండ్లను డైరెక్ట్ చేసే అంత దమ్ము ఎవరికి ఉంది? అంటే కచ్చితంగా టాలీవుడ్ సంచలనం , హిట్ మోషిన్ అనీల్ రావిపూడి అని చెప్పాలి. వాళ్ల ఇమేజ్ కు తగ్గ ఎంటర్ టైనింగ్ స్రిప్ట్ రాయడం అనీల్ కు మంచి నీళ్లు తాగినంత ఈజీ. 20 రోజులు కూర్చు న్నాడంటే స్టోరీ రెడీ అయిపోతుంది. ఇప్పటికే అనీల్ రజనీకాంత్-కమల్ దృష్టిలో పడ్డారు? అన్నది తాజా సమాచారం. ఇటీవలే రిలీజ్ అయిన `మనశంకర వరప్రసాద్ గారు` సక్సెస్ గురించి తెలుసుకున్నారుట.
బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా వసూళ్లను పరిశీలించారు అన్నది మరో సమాచారం. అలాగే అనీల్ గత సినిమా `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా వారివద్దకు చేరిందిట. చిరంజీవికి రజనీకాంత్ అత్యంత క్లోజ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోన్ టచ్ లో ఉంటారు. అలా అనీల్ సంగతులన్నీ రజనీకి దగ్గరగా తెలిసే అవకాశం ఉంది. అనీల్ ఇప్పుడు సౌత్ లోనే నెంబవర్ వన్ డైరెక్టర్. అతడి సినిమాలు కమర్శియల్ గా రీజనల్ మార్కెట్ లో బాగా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి కమల్-రజనీకాంత్ లకు అనీల్ పర్పెక్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు.