సంక్రాంతి చిత్రాల బాక్సాఫీస్.. USలో ఇలా జరిగిందేంటి?

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌ కు పెద్ద పండుగ. అందుకే అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు అప్పుడే సినిమాలను రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు.;

Update: 2026-01-26 18:25 GMT

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌ కు పెద్ద పండుగ. అందుకే అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు అప్పుడే సినిమాలను రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. బాక్సాఫీస్ వద్ద గట్టి ఫైట్ ఉన్నా.. కూడా విడుదల చేస్తుంటారు. ఎప్పుడైనా సంక్రాంతి విండోకు మూడు- నాలుగు సినిమాలకే స్కోప్ ఉండగా.. ఈసారి మాత్రం ఐదు చిత్రాలు విడుదలయ్యాయి.

మంచి అంచనాల మధ్య అవన్నీ రిలీజ్ అవ్వగా.. మూడు చిత్రాలు హిట్ టాక్ తో దూసుకుపోయాయి. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియాతోపాటు నార్త్ అమెరికాలో కూడా మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ మూవీలు అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో.. సాలిడ్ కలెక్షన్స్ ను సాధించాయి.

సూపర్ ఓపెనింగ్స్ అందుకున్న ఆ మూడు సినిమాలు.. ఫస్ట్ వీక్ లో అద్భుతంగా రాణించాయి. దాదాపు అన్ని మెయిన్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ నడిచాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అనుకున్న టైమ్ కన్నా ముందే అందుకున్నాయని చెప్పాలి. ఇప్పటికే లాభాలు కూడా సాధించగా.. ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లో ఉన్నాయి. ఆడియన్స్ నుంచి ఇంకా సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో ఊహించని రీతిలో వసూళ్లు వస్తాయని అంతా ఫిక్స్ అయ్యారు.

కానీ ఇంతలో అనూహ్యంగా వసూళ్లకు బ్రేక్ పడ్డాయని చెప్పాలి. ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ తోనే ఉన్నా.. వాతావరణం సహకరించడం లేదు. ఎందుకంటే కొన్ని రోజులుగా నార్త్ అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర స్థాయిలో చలి గాలులు వీస్తున్నాయి. పెద్ద ఎత్తున మంచు కురుస్తుండడంతో ఒక్కసారి పరిస్థితి అంతా మారిపోయాయి. అనేక చోట్ల రోడ్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి.

ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇంకేముంది.. మూడు సినిమాల దూకుడుకు బ్రేక్ పడింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గిపోయాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి హిట్ స్టేటస్ అందుకున్నప్పటికీ.. ఊహించని రీతిలో వసూళ్లు వస్తాయనుకుంటే అది జరగలేదు. కానీ ఇప్పటికే మూడు సినిమాలు.. భారీ వసూళ్లు సాధించడం గమనార్హం.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా నార్త్ అమెరికాలో 3.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. అనగనగా ఒక రాజు 2 మిలియన్ డాలర్ల మైలురాయి వైపు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 1.73 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. నారీ నారీ నడుమ మురారి మిలియన్ మార్క్‌ చేరుకుంటుందని అంచనా వేయగా.. 7.4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. మంచు తుఫాను లేకపోయి ఉంటే మాత్రం ఆ నెంబర్స్ కచ్చితంగా ఇంకా భారీగా ఉండేవి.

Tags:    

Similar News