బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రణబలి

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.;

Update: 2026-01-26 18:23 GMT

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్ రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ VD14 టైటిల్ ఇంకా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు 'రణబలి' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త ట్రెండ్ ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.




ఈ సినిమా కథ 1850 నుండి 1900 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. చరిత్ర పుస్తకాల్లో దాగిన రహస్యాలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ వారు ఇండియాను ఎలా దోచుకున్నారు, ప్లాన్ ప్రకారం కరువు కాటకాలను ఎలా సృష్టించారు అనే అంశాలను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చాలా ఇంటెన్సిటీతో చూపిస్తున్నారు. హిట్లర్ చేసిన మారణహోమం కంటే ఘోరమైన అరాచకాలను ఈ సినిమాలో కళ్లకు కట్టబోతున్నారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రణబలి అనే లెజెండరీ వారియర్ పాత్రలో కనిపిస్తున్నారు. గ్లింప్స్ చివర్లో గుర్రంపై వస్తూ బ్రిటిష్ ఆఫీసర్‌ను రైల్వే ట్రాక్ మీద ఈడ్చుకెళ్లే సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. విజయ్ బాడీ లాంగ్వేజ్, ఆ రఫ్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక రష్మిక మందన్న జయమ్మ అనే క్యారెక్టర్‌లో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో విలన్ గా కనిపించడం మరో విశేషం.

నిజానికి ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బ్రిటిష్ వారు సేవకులుగా చిత్రీకరించిన మన వీరుల అసలు చరిత్రను వెలికితీసే ప్రయత్నం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అజయ్ - అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ట్యాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో వస్తున్న ఈ సెకండ్ ఫిల్మ్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథ కావడంతో నేటి జనరేషన్ ఆడియన్స్‌కు ఈ సినిమా పక్కాగా కనెక్ట్ అవుతుంది.


Full View


Tags:    

Similar News