చీక‌టి గ‌దిలో బ్యూటీ పెళ్లికి రెడీ.. కానీ ఒక వింత ష‌ర‌తు!

బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` సినిమాతో తెలుగు ఆడియెన్‌కు మైండ్ బ్లాక్ చేసిన ఈ భామ రాఘ‌వ లారెన్స్ `కాంచ‌న 3`లోనూ న‌టించింది.;

Update: 2026-01-27 02:45 GMT

బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` సినిమాతో తెలుగు ఆడియెన్‌కు మైండ్ బ్లాక్ చేసిన ఈ భామ రాఘ‌వ లారెన్స్ `కాంచ‌న 3`లోనూ న‌టించింది. `ఫియర్ ఫ్యాక్టర్: కాట్రోన్ కే ఖిలాడి` టీవీ షోలో కూడా నటించింది. ఇటీవ‌ల హిందీలో బిగ్ బాస్ 15 పార్టిసిపేషన్ తో మరింత ప్రజాదరణ పొందింది. ఈ బ్యూటీ వేడెక్కించే ఫోటోషూట్ల‌తో నిరంత‌రం అభిమానుల గుండెల్లో నిదురిస్తోంది. అయితే కొంత కాలంగా నిక్కీ ప్రేమాయ‌ణం గురించి ఇంట‌ర్నెట్ లో జోరుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నిక్కీ తంబోలి స‌హ‌న‌టుడు అర్బాజ్ పటేల్ తో రిలేష‌న్ షిప్‌లో ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ జంట అనుబంధం ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నార‌న్న ప్ర‌చారం కూడా జోరుగా సాగిపోతోంది. నిక్కీ తంబోలి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వివాహం గురించి పెట్టిన `వింత షరతు`, కొత్త రియాలిటీ షో వివరాల్లోకి వెళితే...

నిక్కీ తంబోలి - అర్బాజ్ పటేల్ ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వెంటనే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. అయితే ఒక ప్రత్యేకమైన కండిషన్ మాత్రం పెట్టారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఏదైనా ఒక రియాలిటీ షోను గెలిచినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటామని నిక్కీ వెల్లడించారు. గెలుపు అనేది వారిద్దరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ అని, ఆ విజయం తర్వాతే జీవితంలో పెళ్లి అనే తదుపరి అడుగు వేయాలని వారు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ది ఫిఫ్టీ (The 50) అనే రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఇందులో మొత్తం 50 మంది సెలబ్రిటీలు ఒకే చోట పోటీపడతారు. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో అర్బాజ్ తనకి బలం అని చెబుతూనే, గేమ్ కోసం అవసరమైతే తన ప్రియుడికి వ్యతిరేకంగా కూడా ఆడతానని నిక్కీ ధీమా వ్యక్తం చేశారు. నా సింహం కి నేను సింహస్వప్నం లాంటిదాన్ని! అంటూ నిక్కీ జోష్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ `ది 50` షో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ షోను గెలిస్తే, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.

Tags:    

Similar News