మారుతి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన ఎప్పుడు?
`ది రాజాసాబ్` చిత్రాన్ని దర్శకుడు మారుతి మాడేళ్ల పాటు ఓ యజ్ఞంలా భావించి పని చేసాడు.;
`ది రాజాసాబ్` చిత్రాన్ని దర్శకుడు మారుతి మాడేళ్ల పాటు ఓ యజ్ఞంలా భావించి పని చేసాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వచ్చిన అవకాశం కావడంతో? ఎక్కడా డీవియేట్ అవ్వకుండా ఒకే ప్రాజెక్ట్ పై ఎంతో కమిట్ మెంట్ గా పని చేయడంవ మారుతి కెరీర్ లోనే ఇదే తొలిసారి. ఈ సినిమా హిట్ తో స్టార్ లీగ్ లో చేరాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసాడు. కానీ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ నిరాశ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడు తున్నాడు. ప్రభాస్ నుంచి మారుతికి ఓదార్పు దక్కింది. ఫలితం విషయంలో వర్రీ అవ్వాల్సిన పనిలేదని భరోసా కల్పించారు.
ప్రభాస్ యధావిధిగా కొత్త సినిమా షూటింగ్ లకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే వెకేషన్ ముగించుకుని ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే `స్పిరిట్` షూటింగ్ లో జాయిన్ అవుతాడు. మరి మారుతి సంగతేంటి? అంటే మారుతి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఇంకొంత సమయం పడుతుందేమో. ఆయన వద్ద స్టోరీలు సిద్దంగా ఉన్నాయా? కొత్త స్టోరీలు రాయాలా? అన్న దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. మూడేళ్లు రాజాసాబ్ మీదనే ఉండటంతో మారుతి కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించ లేదు. `రాజాసాబ్` తర్వాత ఏ హీరోతో పని చేయాలో? అతడు కూడా క్లారిటీగా లేకపోవడం ఈ రకమైన అనిశ్చితికి దారి తీసింది.
ఇకపై మారుతి ప్లానింగ్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. రాజాసాబ్ సక్సెస్ అయితే చిరంజీవి లాంటి స్టార్ పై గురి పెట్టేవాడు. బన్నీ కూడా ముందుకొచ్చే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వారిద్దర్నీ టచ్ చేయాలంటే మారుతి భారీ హిట్ కొట్టినప్పుడే సాధ్యమవుతుంది. దీంతో మారుతి ఇప్పుడు మళ్లీ టైర్ 2 హీరోలతో పనిచేయాల్సిందే. వాళ్లు కూడా చాలా బిజీగా ఉన్నారు. నాగచైతన్య, నాని, నిఖిల్, వరుణ్ తేజ్, సాయితేజ్, అఖిల్, విజయ్ దేవర కొండ, శ్రీవిష్ణు వీళ్లంతా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సెట్స్ లో ఉన్న చిత్రాలతో పాటు తదుపరి ప్రాజెక్ట్ లు కూడా ఫిక్సై ఉన్నాయి.
టైర్ 3 హీరోలు ఖాళీగానే ఉన్నారు. వీరిలో కొందరికి ప్లాప్ లు ఎదురవ్వడంతో సరైన కథల కోసం ఎదురు చూస్తున్నారు. మారుతి ఇప్పటికిప్పుడు సినిమా చేయాలనుకుంటే వాళ్లు మాత్రమే ఆప్షన్ గా ఉన్నారు. ఇటీవలే `శంబాల` తో ఆది సాయికుమర్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ కూడా చేస్తున్నాడు. ఎనర్జిటిక్ స్లార్ రామ్ కూడా ఖాళీగానే ఉన్నాడు. ఇటీవలే `ఆంధ్రా కింగ్ తాలూకా`తో హిట్ అందుకున్నాడు. ఇంకా మరికొంత మంది యంగ్ హీరోలు సరైన కథ, దర్శకుల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో ఎవరితోనైనా మారుతి ముందుకెళ్తాడా? మరో మార్గం వెతుకుతాడా? అన్నది చూడాలి.