ప్రభాస్, బన్నీ అలా.. చరణ్, తారక్ ఇలా!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మధ్య ఆసక్తికర పోలికలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.;

Update: 2026-01-27 00:30 GMT

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మధ్య ఆసక్తికర పోలికలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు వరుసగా భారీ సినిమాలు లైన్లో పెట్టుకుని ఫుల్ స్పీడ్లో దూసుకుపోతుంటే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బాహుబలి తర్వాత ఓ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో ముందంజలో ఉన్నారు. ఆయన చేతిలో ఒకేసారి నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీకి సీక్వెల్‌ గా కల్కి 2 ప్లానింగ్‌ లో ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ కు కొనసాగింపుగా సలార్ 2 కూడా రెడీ అవుతోంది.

ఇక హను రాఘవపూడితో ఫౌజీ చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్నారు. అంతేకాదు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కమర్షియల్, యాక్షన్, పీరియాడిక్, సైకాలజికల్ థ్రిల్లర్.. ఇలా విభిన్న జానర్లలో సినిమాలు ఎంచుకుంటూ ప్రభాస్ తన పాన్ ఇండియా మార్కెట్‌ ను మరింత స్ట్రాంగ్ మార్చుకుంటున్నారు.

అదే సమయంలో పుష్ప సినిమాతో నేషనల్ ఐకాన్‌ గా మారిన అల్లు అర్జున్ ప్రాజెక్టుల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న ఆయన.. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ చేయనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ప్లాన్‌ లో ఉంది.

ఇవే కాకుండా మరో రెండు పెద్ద సినిమాలపై చర్చలు సాగుతున్నాయి. వరుసగా మూడు నుంచి నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టుకుని అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేసులో ప్రభాస్‌ తో సమానంగా పోటీ పడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఇద్దరి లైనప్ లో ప్రస్తుతం ఒక్కో సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత సుకుమార్ తో వర్క్ చేయనున్నారు. ఆ మూవీ కన్ఫర్మ్ అయినప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ కూడా నుంచి ఓకే వచ్చినప్పటికీ అధికారిక అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. దేవర 2 ఉన్నా కూడా అది డౌటే.

అయితే పాన్ ఇండియా స్టార్‌ గా నిలదొక్కుకోవాలంటే ఎప్పుడూ కనీసం మూడు సినిమాలు లైన్లో ఉండటం చాలా ముఖ్యమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ వరుస సినిమాలతో మార్కెట్‌ ను కంటిన్యూ చేస్తుండగా.. చరణ్, ఎన్టీఆర్ కాస్త వెనకబడ్డారని అంటున్నారు. కానీ త్వరలోనే చరణ్, సుకుమార్, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News