బికినీ బీచ్ లో మ‌ల్లిక స్వేచ్ఛా విహారం

Update: 2021-01-30 00:30 GMT
శృంగార ర‌సం ఒలికించాలంటే మ‌ల్లికా శ‌రావ‌త్ త‌ర్వాతే. హిందీ చిత్ర‌సీమలో ద‌శాబ్ధం పాటు మ‌ల్లిక హ‌వా సాగింది. ఆ త‌ర్వాత హాలీవుడ్లోనూ ప్ర‌ముఖ స్టార్ల స‌ర‌స‌న న‌టించిన మ‌ల్లిక హిస్ స్ అనే చిత్రంలో స‌ర్ప‌క‌న్య పాత్ర‌ను పోషించింది. ఆ త‌ర్వాత విదేశీ బోయ్ ఫ్రెండ్ తో స‌హ‌జీవ‌నం చేస్తూ విదేశాల్లో స్థిర‌ప‌డింది.

ప్ర‌స్తుతం ఈ శృంగార నాయ‌కి కేరళలో విహారయాత్రలో ఉంది.  ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఈ వేదిక‌పై వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అద‌ర‌గొడుతున్న మ‌లైకా లేటెస్టుగా స్ట‌న్నింగ్ బికినీ ఫోటోల‌తో  విరుచుకుప‌డింది.

ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో మ‌ల్లిక ఫోజులు ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతూ సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. కేర‌ళ‌లోని ప‌చ్చందాల న‌డుమ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజిలిచ్చిన వాటిని ఇన్ స్టాలో షేర్ చేసింది. అలాగే కేర‌ళ బీచ్ లో మ‌ల్లిక స్వేచ్ఛా విహారానికి సంబంధించిన ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. అయితే ఇంత గ్యాప్ త‌ర్వాత కూడా మ‌ల్లిక మ‌రీ అంత‌గా చెల‌రేగిపోవ‌డం వెన‌క లాజిక్ ఏంటి? అన్న‌ది ఆరా తీస్తే..తిరిగి ఈ అమ్మ‌డు బుల్లితెర షోలు.. వెబ్ సిరీస్ లు.. సినిమాల‌తో బిజీ అయిపోవాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌. నిర్మాత‌గానూ బాలీవుడ్ పై క‌న్నేసింద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News