మల్లేశం హీరోయిన్ ని వద్దనేశారు
టాలీవుడ్ లో పేరున్న సెలబ్రిటీ కథతో కాకుండా బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ గొప్ప వ్యక్తి కథతో రూపొందిన మల్లేశం మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా కొత్త అమ్మాయి అయినప్పటికీ అనన్య నటనకు భార్య పాత్రలో ఒదిగిన తీరుకి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రమోషన్ లో విస్తృతంగా పాల్గొంటున్న అనన్య సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇన్ఫోసిస్ లో మంచి పొజిషన్ లో ఉంది. యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈ అమ్మాయి తర్వాత యాక్టింగ్ ఇన్స్ టిట్యూట్ లో చేరింది.
అక్కడ దర్శకుడు రాజ్ ఆర్ కంట్లో పడింది. ముందు చేసిన ఆడిషన్స్ లో అనన్యని రాజ్ తిరస్కరించారు. మహానటి క్లైమాక్స్ లో సమంతాలా చేసి చూపమంటే కాస్త ఎక్కువ ఇమిటేట్ చేయడంతో వద్దనేశారు. ఆ తర్వాత సెలవు పెట్టి కసిమీద ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టడంతో ఫైనల్ గా రాజ్ చేత శెభాష్ అనిపించుకుని ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మల్లేశం తెచ్చిన పేరుతో అనన్య ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందరూ పద్మ పేరుతోనే పిలుస్తున్నారట.
మధుర శ్రీధర్ నిర్మాణంలో ఓ పెద్ద వెబ్ సిరీస్ చేసిన అనన్య ఇప్పటికే 70 ఎపిసోడ్ల షూటింగ్ లో పాల్గొంది. ఎప్పటికప్పుడు లీవులు తీసుకుంటున్నా సంస్థ ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఇంత బాగా చేస్తావని ఊహించలేదని ఫ్రెండ్స్ కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి అనన్య ఉప్పొంగిపోతోంది. ముప్పై నలభై సార్లు స్క్రిప్ట్ చదివి అవగాహన చేసుకుని మరీ కష్టపడ్డాను అని చెబుతున్న అనన్య కోరుకున్న ఫలితాన్ని దక్కించుకుంది. కొసమెరుపు ఏంటంటే ఇంత విజయం సాధించినా అనన్యకు ఇంకా కొత్త ఆఫర్లు ఏమి రాలేదు. మల్లేశం రాజ్ ఆర్ తరహాలో ముందు వద్దనుకుని తర్వాత పిలుస్తారమేమో చూడాలి