• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జనగణమన'.. 'మేజర్' లోని...

'జనగణమన'.. 'మేజర్' లోని స్ఫూర్తిదాయక గీతం..!

By - Tupaki Desk
Update: 2022-06-02 05:30 GMT
వర్సటైల్ స్టార్ అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్-డ్రామా ''మేజర్‌'' రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

మరికొన్ని గంటల్లో ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. తాజాగా 'జనగణమన' అనే థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. 'జయహే జయహో.. ఎగిరే కలలో.. రగిలే రవివో.. అలిసే బరిలో..' అంటూ సాగిన ఈ దేశభక్తి గీతం ఉద్వేగభరితంగా ఉంది. సైనికుడిగా ఉండటమంటే ఏమిటి? సోల్జర్ గా అవ్వాలని ఎందుకు అనుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ పాటను రూపొందించారు.

చిన్నతనంలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో దేశం కోసం సేవ చేయడానికి ప్రేరేపించిన మొదటి క్షణం.. ముంబై టెర్రరిస్టుల దాడిలో జరిగిన విషాద సంఘటన సమయంలోనే సైన్యంలో చేసిన ప్రయాణాన్ని ఈ పాటలో చూడొచ్చు. సైనికుడి గురించి తన తండ్రి అడిగిన ప్రశ్నకు మేజర్ ఇచ్చిన సమాధానం ఆలోచింపజేస్తుంది.

మేజర్ జీవిత ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా భావోద్వేగంగా ఉంటుందని ఈ పాటలో తెలుస్తోంది. 'మేజర్' సినిమాకు మధురమైన బాణీలు సమకూర్చిన శ్రీచరణ్ పాకాల.. ఇప్పుడు 'జన గణ మన' గీతానికి కూడా అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. రాజీవ్ భరద్వాజ్ దేశభక్తిని రేకెత్తించే సాహిత్యాన్ని అందించగా.. టోజన్ టోబి ఈ పాటను ఆలపించారు.

'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇందులో శోభిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ - ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించారు. తెలుగు మలయాళ హిందీ భాషల్లో రేపు జూన్ 3న ''మేజర్'' మూవీ రిలీజ్ కాబోతోంది.

Full View




Tags:    
  • Jana Gana Mana 
  • Major 
  • Major Movie 
  • Adivi sesh 
  • Major Songs 
  • Major Releasing Tomorrow 
  • saiee mmanjrekar 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS