ఆ విషయంలో మహేష్ - పవన్ ఆలోచనలు కామన్ గా ఉన్నాయి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత తన సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ''అభిమానుల గుండెల్లో నాకిచ్చిన స్థానం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నా ప్రతీ సినిమాలో కూడా ఎంతో కొంత చూపించాలని తపన పడేవాడిని. సినిమా అనేది విశిష్టమైనది బలమైనది. అందుకే సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సమాజానికి మేలు చేసేవి చూపించాలనుకుంటాను'' అని అన్నారు.
''అభిమానులు లేకపోతే పవన్ కల్యాణ్ లేడు. నేను ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఏమాత్రం అండదండలు లేని సమూహం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మీ గుండె చప్పుడు అర్థం చేసుకున్నవాడిని. మీ గుండెల్లో ప్రేమను గౌరవించే వాడిని. మీకోసం సినిమాల ద్వారా ఆనందాన్ని ఇవ్వాలని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందానికి తగ్గట్టుగా సినిమాలు చేసి ఉండకపోవచ్చు. కానీ నా ప్రయత్న లోపం ఎప్పుడూ ఉండదు. అన్ని సమయాల్లో కాలం అనుకూలంగా ఉండదు. కాలం కరుణించాలి. ఎక్కువ సినిమాలు చేయాలి'' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోని పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమాన హీరో ఐటమ్ సాంగ్స్ కంటే దేశభక్తి గీతాలు పెట్టాలని కోరుకుంటాడని పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తమ అభిమాన హీరో చెప్పడమే కాదు సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసి చూపించాడని.. ఇవి మా హీరోకి2కొత్తేమీ కాదని ట్వీట్స్ పెడుతున్నారు. అలానే ఈ సందర్భంగా మహేష్ గతంలో సినిమా ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలను షేర్ చేస్తున్నారు. 'శ్రీమంతుడు' మూవీ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..''అభిమానులందరు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. లాస్ట్ సినిమాకి డిజప్పాయింట్ చేసాను. దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి'' అని చెప్పిన వీడియోని టషేర్ చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ ఇద్దరి సినిమాల విషయంలోనే కాకుండా.. స్పీచ్ లు కూడా కామన్ గా ఉండటం గమనార్హం. నిజానికి స్టార్ హీరోలు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం ద్వారా అది జనాలకు ఎక్కువగా రీచ్ అవుతుంది. ఇప్పుడు పవన్ - మహేష్ అలాంటి సినిమాలతో వస్తుండటం మంచి విషయమనే చెప్పాలి.