• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతగా మారుతున్న...

నిర్మాతగా మారుతున్న ఎన్టీఆర్ పీఆర్వో

By - Tupaki Desk
Update: 2017-05-17 10:44 GMT
సినీ రంగంలోకి ఏ రకంగా ప్రవేశించినా.. అంతిమంగా హీరోగానో.. దర్శకుడిగానో.. నిర్మాతగానో మారాలనుకుంటారు జనాలు. టాలీవుడ్లో పీఆర్వోలుగా ప్రవేశించిన వాళ్లు కూడా తర్వాత తమ గమ్యాన్ని మార్చుకుని.. పెద్ద స్థాయికి ఎదిగే ప్రయత్నం చేసిన వాళ్లే. ఇందుకు సీనియర్ పీఆర్వో బీఏ రాజు సరైన ఉదాహరణ. ఆయన సొంతంగా బేనర్ పెట్టి అనేక చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన బేనర్ నుంచి ‘వైఖాఖం’ అనే సినిమా రాబోతోంది. మరో పీఆర్వో పులగం చిన్న నారాయణ.. అప్పుడప్పుడూ సినిమాలకు పాటలు రాస్తుంటాడు. మాటలూ రాస్తుంటాడు. ఇప్పుడు టాలీవుడ్లో మరో ప్రముఖ పీఆర్వో కొత్త అవతారం ఎత్తుతున్నాడు. అతనే మహేష్ కోనేరు.

జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలకు రెగ్యులర్ గా పీఆర్వోగా పని చేసే మహేష్ కోనేరు.. దీంతో పాటు ‘బాహుబలి’ సినిమాకు కూడా పీఆర్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎన్టీఆర్ కు సన్నిహితుడైన మహేష్.. ప్రొడక్షన్లోకి దిగుతున్నాడు. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో కొత్తగా బేనర్ మొదలుపెడుతున్నాడు మహేష్. కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట అతను. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల ద్వారా ఫైనాన్స్ విషయంలో అతడికి ఢోకా ఏమీ లేదని సమాచారం. మరి ఇతడికి ఎన్టీఆరో.. కళ్యాణ్ రామో అవకాశాలిస్తారా.. లేక వేరే హీరోల్ని ట్రై చేస్తాడో చూడాలి. త్వరలోనే మహేష్ నిర్మాతగా రాబోయే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mahesh Koneru 
  • Producer 
  • Tollywood Movies 
  • East Coast Productions 
  • Telugu NEWs 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS