• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొదలైన మహేష్ బర్త్ డే...

మొదలైన మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. కామన్ డీపీ విడుదల!

By - Tupaki Desk
Update: 2021-06-20 15:39 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ ఓకే చేసిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ అప్ కమింగ్ మూవీ పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో నెలకొన్నాయి. గతేడాది మహేష్ అధికారికంగా సర్కారు వారి పాట టైటిల్ ప్రకటించి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా చాలా డిఫెరెంటుగా ప్లాన్ చేశారు. “సర్కారు వారి పాట” అంటూ యూనిక్ టైటిల్ రిలీజ్ చేయగానే మూవీ పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ప్రీ లుక్ లో మహేష్ న్యూ మేకోవర్ కూడా అభిమానులకు అల్టిమేట్ ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలి.

అలా టైటిల్ రిలీజ్ చేశారో లేదో దేశవ్యాప్తంగా మహేష్ ఫ్యాన్స్ అంతా భారీ ట్రెండ్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య అభిమాన హీరోల పుట్టినరోజులకు సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిజానికి సౌత్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశంలోనే అత్యధికంగా ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ నుండి అయితే ట్విట్టర్ ఫాలోయర్స్ పరంగా ఆయనే టాప్. మహేష్ ఏది చేసినా సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ వచ్చారు ఫ్యాన్స్. అయితే ఈ ఏడాది కూడా మహేష్ బర్త్ డే గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. పుట్టినరోజు వేడుకలకు ఇప్పటినుండి ఏర్పాట్లు చేసేస్తున్నారు.

ఎందుకంటే ప్రతీ ఏడాది ఆయన ఫ్యాన్స్ బర్త్ డేకి నెల ముందే సందడి మొదలు పెడతారు. కానీ ఈసారి ఏకంగా 50రోజుల ముందే సందడి మొదలయింది. సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ప్రతి విషయంలో చురుకుగా ఉంటారు. అందుకే ట్విట్టర్ వేదికగా ట్రెండ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. తాజాగా మహేష్ పుట్టినరోజుకు 50డేస్ ఉందంటూ కామన్ డీపీ రిలీజ్ చేశారు. 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ సీడీపీ రిలీజ్ చేశారు. ఆ కామన్ డీపీలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు - అతడు - బిజినెస్ మ్యాన్ సినిమాలోని ఫోటోలతో డిజైన్ చేశారు. ఈ ఏడాది మహేష్ తన 46వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇదిలా ఉండగా.. త్వరలోనే త్రివిక్రమ్ తో తన మూడో సినిమా స్టార్ట్ చేయనున్నాడు.




Tags:    
  • Superstar 
  • mahesh Babu 
  • Latest news 
  • Mahesh 
  • Birthday Celebrations 
  • started 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS