• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ఆ 2500 మంది పిల్లల...

మహేష్ ఆ 2500 మంది పిల్లల కోసం..

By - Tupaki Desk
Update: 2016-11-01 14:45 GMT
గత కొన్ని రోజులుగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం అభిమానులు గమనించే ఉంటారు. చుట్టూ పిల్లలు.. వారి మధ్య అందంగా నవ్వుతున్న మహేష్.. ఈ ఫొటో అందరికీ భలే నచ్చేసింది. మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్లో సైతం ఈ ఫొటో దర్శనమిచ్చింది. ఇప్పుడీ ఫొటోకు సంబంధించిన ఆసక్తికర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా షూటింగులో భాగంగా పిల్లల మధ్య తీసిన ఓ సన్నివేశం సందర్భంగా తీసిన ఫొటో అది. ఆ సన్నివేశంలో 2500 మంది పిల్లలు పాల్గొన్నారట.

ఆ 2500 మందికి మహేష్ బాబు స్పెషల్ గిఫ్ట్స్ పంపించడం విశేషం. దీపావళి సందర్భంగా ఒక బాక్సులో చాకెట్లు.. మ్యాంగో డ్రింక్స్ పెట్టి వాటిని ఆ పిల్లలకు పంపించారు. దీంతో పాటు బాక్సు లోపలే మహేష్ బాబు నోట్ కూడా ప్రింట్ చేశారు. ‘‘నేను పనిచేసే చోటికి వచ్చి ఎంతో ఆనందాన్ని కలిగించిన నా చిన్నారి స్నేహితులకు థ్యాంక్స్.. ఎప్పుడూ మెరిసిపోతూ ఉండండి.. లవ్ - మహేష్ బాబు’’ అని ఆ నోట్లో పేర్కొన్నాడు ప్రిన్స్. మహేష్ బాబును కలవడం.. తనతో షూటింగ్ చేయడమే ఆనందం అంటే.. మహేష్ నుంచి స్వయంగా ఇలాంటి గిఫ్ట్ కూడా అందుకోవడం అంటే ఇక ఆ పిల్లల ఆనందానికి అవధులుండవు. వాళ్లకు ఎప్పటికీ మరిచిపోలేని కానుకే ఇచ్చాడు ప్రిన్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mahesh Babu 
  • Kids 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS