సూపర్ స్టార్ నుండి క్రేజీ అప్డేట్స్ రానున్నాయా..??

Update: 2021-04-23 05:31 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీ అనే విషయం విదితమే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అయితే ఆగష్టులో మహేష్ బాబు బర్త్ డే గురించి ఇప్పటినుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆయన నుండి అభిమానులు పలు క్రేజీ ట్రీట్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి సర్కారు వారి పాట టీజర్. మహేష్ నుండి మోస్ట్ అవెయిటింగ్ సినిమాలలో ఇది ఒకటి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి సర్కార్ నుండి టీజర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

మరోటి క్రేజీ కాంబినేషన్. మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఓకే అయినట్లు టాక్. కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన బయటికి రాలేదు. అయితే అతడు, ఖలేజా సినిమాల తర్వాత రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను ఆగష్టు 9న అధికారికంగా లాంచ్ చేస్తారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. మరి ఈ రెండు క్రేజీ అప్డేట్స్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంతేగాక మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే పేరు వినిపిస్తుంది. చూడాలి మరి మహర్షి తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో. ప్రస్తుతం సర్కారు వారి పాటలో మహేష్ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. మైత్రి మూవీస్, 14 రీల్స్ తో పాటు మహేష్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News