కూతురి కోసం సింగర్ గా మారిపోయిన మహేష్...!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మనందరికి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా వారిని ఔటింగులకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన పిల్లలు గౌతమ్ కృష్ణ - సితార లతో కలిసి మహేష్ చిన్నపిల్లాడిగా మారిపోయి అల్లరి చేస్తుంటాడు. కానీ మహేష్ ఇంట్లో సింగర్ గా మారిపోయి సాంగ్స్ కూడా పాడతాడని లేటెస్ట్ గా నమ్రత ద్వారా బయటకి వచ్చింది. 'ఐ విల్ నెవెర్ లెట్.. యూ గో.. లెట్ యూ గో..'' అంటూ మహేష్ ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడే వీడియో మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ ఇంటికే పరిమితమయ్యాడు. మాములుగా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ గ్యాప్ వస్తే ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతుంటారు. ఇప్పుడు షూటింగ్ లు లేకపోవటంతో మొత్తం సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయించాడు మహేష్. సితార, గౌతమ్ లతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ ముగ్గురు కలిసి చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది నమత్ర. ఈ లాక్ డౌన్ సమయంలో రోజుకో వీడియో ఫోటోలను షేర్ చేస్తూ .. మహేష్ బాబు, సితార, గౌతమ్‌ల గురించి ఫ్యాన్స్ కు తెలిసేలా చేస్తోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన క్యూట్ త్రో బ్యాక్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. టెడ్డీ బేర్ పట్టుకుని ఓ పాట పాడుతూ తన కూతురు సితార పాపను మహేశ్ బాబు కడుపుబ్బా నవ్వించిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ''లవ్, లైఫ్, నవ్వులు.. మహేశ్ బాబు సితార పాపల లిటిల్ టెడ్డీ కన్సర్ట్.. ఆయనలోని చిన్నపిల్లాడిని ఆమె మాత్రమే బయటకు తీసుకురాగలదు'' అని నమ్రత పేర్కొంది. ఇప్పుడు మహేష్ సితార ల టెడ్డీ బేర్ కన్సర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరి సరదా ఆటాపాటలని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే లాక్ డౌన్ పూర్తైన తర్వాత మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు.