• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ ..ది రియ‌ల్...

మ‌హేష్ ..ది రియ‌ల్ బిజినెస్ మేన్

By - Tupaki Desk
Update: 2019-01-31 05:35 GMT
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` ప్ర‌స్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని లీకులు ఇటీవ‌ల చిత్ర‌యూనిట్ ని బెంబేలెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. లీకుల‌తో పాటే ఈ సినిమాపై భారీగా హైప్ పెరుగుతోంది. ఈ స‌మ్మ‌ర్ లో మ‌హేష్ ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు బెస్ట్ ట్రీట్ ఇస్తాడ‌నే అంతా ఆశిస్తున్నారు. రైతుగా - స్టూడెంట్‌ గా - క్రికెట‌ర్ గా విభిన్న‌మైన గెట‌ప్పుల్లో మ‌హేష్ అల‌రించ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మ‌వుతోంది.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ 26 సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. దీంతో పాటే 2019లో మ‌హేష్ మ‌రికొన్ని కొత్త పంథా ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకురాబోతున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌హేష్ - న‌మ్ర‌త జంట ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్ పేరుతో థియేట‌ర్ల వ్యాపారంలో అడుగుపెట్టారు. దీంతో పాటే సినిమాల నిర్మాణంలో భాగంగా - చిన్న సినిమాల నిర్మాణం - వెబ్ సిరీస్ ల రూప‌క‌ల్ప‌న వంటి ప్ర‌ణాళిక‌ల్లో బిజీగా ఉన్నారు.

లేటెస్ట్ ఇన్ఫో ప్ర‌కారం .. జియో ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి మూడు సీజ‌న్ల‌కు స‌రిప‌డా వెబ్ సిరీస్ రూప‌క‌ల్ప‌న‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సిరీస్ కి టైటిల్ ని ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. చార్లీ అండ్ నాన్న‌కు ప్రేమ‌తో అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. హుసేన్ షా కిర‌ణ్ అనే ర‌చ‌యిత ఈ వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించ‌నున్నారు. 24 ఎపిసోడ్లుగా తెర‌కెక్కే ఈ సిరీస్ పూర్తిగా థ్రిల్ల‌ర్ ఫార్మాట్‌ లో రూపొంద‌నుంది. ఇది కేవ‌లం తెలుగు ఆడియెన్ ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని రూపొందించ‌లేద‌ని - పాన్ ఇండియా బేసిస్ లో తెలుగు - త‌మిళం - హిందీ - క‌న్న‌డ‌ - మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేస్తూ రూప‌క‌ల్ప‌న చేయ‌నున్నార‌ట‌. మ‌హేష్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమా క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నారు కాబ‌ట్టి వెబ్ సిరీస్ రూప‌క‌ల్ప‌న‌పై న‌మ్ర‌త అన్ని విధాలా త‌నే ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ట‌. మొత్తానికి ఒక్కో బిజినెస్ లో అడుగుపెడుతూ మ‌హేష్ `ది రియ‌ల్ బిజినెస్ మేన్‌` అని నిరూపిస్తున్నాడు.
   

Tags:    
  • Mahesh babu 
  • Web Series 
  • Telugu News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS