బావా.. నువ్వు సూపర్ అంటున్న మహేష్!

Update: 2016-10-27 08:48 GMT
రాజకీయాలకు, రాజకీయ ప్రసంగాలకు స్టేట్ మెట్ లకూ వీలైనంత దూరంగానే ఉంటుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ శ్రీమంతుడు సినిమా అనంతరం జనాలతో బాగా కలిసి మాట్లాడటంతో పాటు "గ్రామాల దత్తత" అనే కాన్సెప్ట్ తో మహేష్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధులతో జయదేవ్ రోడ్లను చూసి మురిసిపోతున్నారు ప్రిన్స్. ఈ సందర్భంగా తన బావ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్‌ కు కితాబిచ్చారు.

ఈ విషయంపై సోషల్ మీడియా ఫేస్‌ బుక్ ద్వారా తన బావను ప్రశంసించిన మహేష్... బుర్రిపాలెం మెయిన్ రోడ్డుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌ బుక్‌లో పెట్టారు. రోడ్లు బాగైన విధానం బాగుందని అభిప్రాయపడ్డారు. జయదేవ్ ఎంపీ నిధులతో ఆ రోడ్లను బాగు చేశారని, తనకు తన ఆలోచనకు ఆశయానికి మద్దతుగా నిలబడుతున్నందుకు గల్లా జయదేవ్‌కు ధన్యవాదాలు అని ఈ సందర్భంగా మహేష్ పేర్కొన్నారు.

కాగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఏపీలో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బుర్రిపాలెం గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామంలోని డ్రెయిన్లు, రహదారులు మెరుగుపడ్డాయి.
Tags:    

Similar News