సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే...!

Update: 2020-09-23 07:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' అనే సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల అమెరికాలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఫ్రీ హెయిర్ స్టైల్.. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ లుక్ అదిరిపోయింది. దీంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా, 'సర్కారు వారి పాట'లో మహేష్ క్యారక్టరైజేషన్.. మేనరిజం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతోందట. గత కొంతకాలంగా మాస్ లుక్ కి దూరంగా ఉన్న మహేష్.. ఈ సినిమాతో ఆ లోటును తీర్చబోతున్నాడట. మహేష్ బాడీ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీలో ఇంతకముందు చూడని వేరియేషన్ ని చూపించబోతున్నారట. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ పై ప్రత్ర్యేక ద్రుష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మీద మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని అందరి అంచనాలను అందుకునేలా రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.
Tags:    

Similar News