మరో శ్రీమంతుడుకి సిగ్నల్‌ ఇచ్చేశాడా?

Update: 2015-10-04 11:30 GMT
గతంలో ఓ సినిమా అయ్యాక గానీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించని మహేష్ బాబు.. ఇప్పుడు ట్రెండ్ మార్చేశాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే.. మరో వెంచర్ ని సిద్ధం చేసేస్తున్నాడు. శ్రీమంతుడు సక్సెస్ అయి రన్ అవుతుండగానే.. శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవాన్ని ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేశాడంటే., మహేష్ స్పీడ్ అర్ధమవుతుంది.

తనకు శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాలకు.. స్టోరీ సిద్ధం చేసుకోమ్మని ప్రిన్స్ చెప్పాడని టాలీవుడ్ టాక్. జక్కన్న తన నెక్ట్స్ వెంచర్ గా 500 కోట్లతో తీయబోయే గరుడ అనే భారీ చిత్రానికి మహేష్ నే హీరోగా తీసుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ - వినాయక్ లాంటి డైరెక్టర్స్ కూడా మహేష్ తో మూవీకి రెడీగా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మురుగదాస్ కూడా చేరాడట.

సామాజిక కథాంశాలను కమర్షియల్ ఎంటర్ టెయినర్ లుగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు మురుగదాస్. ఠాగూర్ - స్టాలిన్ లు ఇలాంటివే. ఇలాంటి ఓ స్టోరీ లైన్ ని మహేష్ కి వినిపించాడట మురుగదాస్. బాగా ఇంప్రెస్ అయిన ప్రీన్స్.. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని, తప్పకుండా చేద్దామని అన్నాడట. ఇప్పటికే సామాజిక కోణంతో తీసిన శ్రీమంతుడు హిట్ కావడంతోపాటు.. మురుగదాస్ తో చేసేందుకు మహేష్ ఎప్పటినుంచో ఉత్సాహం చూపిస్తున్నాడు. రెండూ కలిసొచ్చేసరికి.. ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. మహేష్ చేయబోయే నెక్ట్స్ మూవీ ఇదేనంటున్నారు. మరి అసలు విషయం ఆ సూపర్ స్టారే చెప్పాలి.
Tags:    

Similar News