అల్లూరి ఒక బైబిల్.. టచ్ చేయను

Update: 2015-08-02 06:23 GMT
"రైటర్స్ తమదైన విజన్ తో ముందుకొస్తే ఓకె. అంతేకానీ, నాకు ఫలానా పాత్ర చేయాలనుందని, నేనే కథ వండించడం కరెక్ట్ కాదు", అంటున్నారు మహేష్ బాబు. ఆయన నటించిన తాజా చిత్రం "శ్రీమంతుడు" విదుదల అవుతున్న సందర్బంగా విలేకరులు ఆయన్ను తండ్రి కృష్ణ గారి హిట్ సినిమాలను రీమేక్ చేయ్యోచ్చు కదా అని అడిగిన ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

అసలు క్లాసిక్ సినిమాలను క్లాసిక్ గా వదిలేయడమే బెస్ట్ అనేది మహేష్ ఫీలింగ్. అలా కాకుండా, సినిమాను రీమేక్ చేస్తే అనవసరంగా దాని పరువు తీసినత్ట్టే. ఎందుకంటే ఫాన్స్ అందారు రీమేక్ అనగానే చాల అంచనాలతో ఉంటారు. ఒరిజినల్ సినిమాను మించి ఏ మాత్రం తీయలేకపోయినా కూడా సీన్ సితార్ అయిపొతుంది. ఆల్రెడీ రామ్ చరణ్ తీసిన జంజీర్ సినిమా చూస్తె ఆ విషయం మనకు తెలుస్తుందిగా. ఇక మహేష్ మేటర్ కు వస్తే.. "నాన్న గారి సినిమాల్లో అల్లూరి సీతారామరాజు నాకు బైబిల్ లాంటిది. వందసార్లయినా చూసి ఉంటా. అలాంటి క్లాసిక్ ను మళ్ళీ మళ్ళీ చూసి ఆనందించాలే తప్ప, మనం చేయాలని టచ్ చేయకూడదు" అంటూ ముగించారు.

ఇకపోతే జేమ్స్ బాండ్.. అదేనండి గూడచారి 116 తరహా సినిమాలను చేస్తారా మన సూపర్ స్టార్ అంటే.. "అబ్బే అలాంటి కథలు రైటర్స్ రాస్కోని రావాలి కాని, నేను మాత్రం ఈ పాత్ర చుట్టూ కథ అల్లుకు రండి అంటి ఆర్డర్స్ వేయను.." అని సెలవిచ్చారు సూపర్ స్టార్.
Tags:    

Similar News