హాట్ టాపిక్: వెబ్ సీరీస్ లో మహేష్ బాబు

Update: 2018-09-15 14:30 GMT
కాలం తో పాటు చాలా విషయాలు మారుతుంటాయి. గతంలో బుల్లితెరవైపు స్టార్ హీరోలు అసలు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు స్టార్ హీరోల టీవీ ప్రోగ్రాములు కామన్ అయ్యాయి. ఇక తాజాగా వెబ్ సీరీస్ ట్రెండ్ ఊపందుకుంటోంది.  స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ అయిన నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - జీ5 లు ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

ఇప్పటికే మాధవన్ అమెజాన్ ప్రైమ్ లో 'బ్రీథ్' వెబ్ సీరీస్ ద్వారా చాలామందిని మెప్పించాడు. బాలీవుడ్లో నవాజుద్దిన్ సిద్ధిఖి.. సైఫ్ అలీ ఖాన్ లు నెట్ ఫ్లిక్స్ లో 'సేక్రేడ్ గేమ్స్' ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక.  కియారా అద్వాని.. మనిషా కొయిరాలా.. రాధిక ఆప్టే నటించిన 'లస్ట్ స్టోరీస్' ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక  తెలుగులో నవదీప్..  జగపతి బాబులు వెబ్ సీరీస్ లలో నటించడం జరిగింది కానీ టాప్ లీగ్ స్టార్స్ ఎవరూ ఇంతవరకూ వెబ్ సీరీస్ వైపు చూడలేదు.  తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు వెబ్ సీరీస్ లో నటించే దిశగా అడుగులు పడుతున్నాయట.

నెట్ ఫ్లిక్స్ వారు ఒక వెబ్ సీరీస్ గానీ.. లేదా నెట్ ఫ్లిక్స్ ఫిలిం గానీ మహేష్ బాబుతో నిర్మించేందుకు మహేష్ వైఫ్ నమ్రత తో చర్చలు జరుపుతున్నారట. మహేష్ బాబు లీడ్ రోల్ అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం తో ఉండే ప్లస్ ఏంటంటే ఈ వెబ్ సీరీస్ అన్ని భాషలవారికి అందుబాటులో ఉండడం. అన్నీ మేజర్ బాషలలో వెబ్ సీరీస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇతర భాషా ప్రేక్షకులలో మహేష్ రీచ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.  దీంతో నమ్రత ఈ విషయంలో ఇంట్రెస్ట్ గా ఉందట. ఇక హోం డిపార్ట్మెంట్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే సుపర్ స్టార్ తన స్టాంప్ వేయడానికి పెద్దగా అభ్యంతరం ఉండదు.
Tags:    

Similar News