• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ త్రిపాత్రాభిన‌యం.....

మ‌హేష్ త్రిపాత్రాభిన‌యం.. అందుకేనా మేకోవ‌ర్?

By - Tupaki Desk
Update: 2020-05-30 03:45 GMT
ప‌‌ర‌శురామ్ దర్శ‌క‌త్వంలో మ‌హేష్ 27 సెట్స్ కెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ‌చివ‌రి నిమిషంలో వంశీ పైడిప‌ల్లి నుంచి ప్రాజెక్టును ప‌ర‌శురామ్ టేకోవ‌ర్ చేసాడు. ఇక ఈ సినిమాని సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే (మే 31) రోజున ప్రారంభించ‌నున్నార‌ని ప్ర‌చారం అవుతోంది. అంటే రేపు ఉద‌యం ఎలాంటి హంగామా లేకుండా అధికారికంగా ఠెంకాయ కార్య‌క్ర‌మం చేసేయ‌నున్నార‌ని లీకులు అందుతున్నాయి. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ర‌శురామ్ కానీ మైత్రి మూవీ మేక‌ర్స్ బృందం కానీ అధికారికంగా ఎలాంటి వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు ఈ మూవీకి సంబంధించిన స‌మాచారం ఫ్యాన్స్ ని ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ మూవీని తెర‌కెక్కించిన ప‌ర‌శురామ్ మ‌హేష్ ని ఏ రేంజులో చూపించ‌బోతున్నాడోనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్ గెట‌ప్ ఛేంజ్ చేశాడు. మాస్ట‌ర్ గౌత‌మ్ కి అన్న‌య్యా.. అని ఆశ్చ‌ర్య‌పోయేంత‌గా టీనేజీ రూపం క‌నిపిస్తోంది. అంటే ఈ గెట‌ప్ పైనే తొలి షెడ్యూల్ ఉంటుంద‌ని అర్థమ‌వుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం జూన్ తొలి వారం నుంచి షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని వెసులుబాటు కల్పించింది కాబ‌ట్టి ఇప్ప‌టికే  ఏర్పాట్లు సాగుతున్నాయ‌నే అభిమానులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే మహేష్ 27 టైటిల్ కూడా రివీలైంది. టైటిల్ `సర్కార్ వారి పాట` అని గత కొద్ది రోజులుగా ప్రచారం అవుతోంది. తాజాగా మ‌రో షాకిచ్చే విష‌యం లీకైంది. ఈ క్రేజీ మూవీలో మహేష్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌. టీనేజీ .. మిడిలేజీ.. కాస్త ఏజ్డ్ ప‌ర్స‌న్ గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే త్రిపాత్రాభిన‌యం కెరీర్ లోనే తొలిసారి. బాల‌న‌టుడిగా మ‌హేష్ ద్విపాత్రాభిన‌యం చేసినా హీరో అయ్యాక మాత్రం కూద‌ర‌లేదు. కానీ ఇప్పుడు ఏకంగా త్రిపాత్రాభిన‌యం చేసేస్తున్నాడ‌న్న ప్ర‌చారంతో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఎగ్జ‌యిట‌యిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తానికి గౌత‌మ్ మీన‌న్ లా ప‌ర‌శురామ్ ఏదో గ‌ట్టి ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌హేష్ ఇమేజ్ కి త‌గ్గ క‌థాంశంతో గీత గోవిందం రేంజు సెన్సిబిలిటీస్ ని ఇందులో ఇన్ బిల్ట్ చేస్తే స‌క్సెస్ సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదేమో!
Tags:    
  • Mahesh Babu 
  • Mahesh Babu Huge Makeover 
  • Parasuram Movie 
  • Ssmb27 
  • Sarkar Vaari Paata 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS