తల్లి కాబోతున్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన మహేష్ హీరోయిన్...!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హీరోయిన్ అమృతా రావ్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన సినిమా మాదిరే అతిథిలా వచ్చి.. అతిథిలా వెళ్లిపోయింది. బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. 'మై హూనా' 'షికార్' 'వివాహ్' 'హే బేబి' 'లైఫ్ పార్ట్‌నర్' 'జాలీ ఎల్ఎల్‌బీ' 'సత్యాగ్రహ' 'థాకరే' తదితర చిత్రాల్లో నటించింది. 2016లో ఆర్ జె అన్ మోల్ ని వివాహం చేసుకున్న అమృతా రావ్ ఇప్పుడు తల్లి కాబోతోందని తెలుస్తోంది.
బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో అన్ మోల్ తో ప్రేమలో పడింది అమృత. అతనితో ఏడేళ్లపాటు డేటింగ్ చేసిన అమృత 2016లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. అయితే చాలా కాలం పాటు అమృత రావు తన పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. అయితే ఇప్పుడు ఆమె తల్లి కాబోతున్న విషయాన్ని కూడా అలానే సీక్రెట్ గా ఉంచింది. కానీ ఇటీవల తన భర్తతో పాటు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు అమృత గర్భంతో ఉండటం మీడియా గమనించింది. అప్పటి నుంచి ఆమె గర్భవతి అనే వార్తలు మీడియాలో వస్తుండటంతో ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. అమృత రావు తల్లి కాబోతున్నారనే విషయం బయటకు రావడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.