ఆఫర్ ఇవ్వకపోయినా స్నేహానికి విలువిచ్చిన మహేష్
నా కోసం రెండేళ్లు వేచి చూశాడు వంశీ పైడిపల్లి. వేరే ఎవరూ నా కోసం అంత కమిట్ మెంట్ తో వెయిట్ చేయలేదు. అది నచ్చడం వల్లనే వంశీ నాకు స్నేహితుడు అయ్యాడు!! అని చెప్పారు సూపర్ స్టార్ మహేష్. మహర్షి సినిమా కోసం దాదాపు రెండేళ్లు పైగానే వేచి చూసిన పైడిపల్లి పేషెన్స్ కి మహేష్ ఇచ్చిన రెస్పెక్ట్ అది. స్నేహానికి విలువిచ్చి అంతగా వేచి చూసిన స్నేహితుడిని లైఫ్ లో ఎప్పటికీ విడువనని మరోసారి నిరూపిస్తున్నారు మహేష్.
పైడిపల్లి కుటుంబంతో మహేష్ ఫ్యామిలీ రిలేషన్ షిప్ ఎక్కడా చెక్కు చెదరలేదు. అడపాదడపా వీరంతా డిన్నర్ పార్టీల్లో కనిపిస్తున్నారు. విదేశీ విహార యాత్రలు కామన్ గానే ఉన్నాయి. దుబాయ్ నుంచి విహార యాత్రను ముగించి తిరిగి వచ్చిన తరువాత మహేష్ వారం క్రితం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అతను ఈ వారం ప్రారంభంలో మళ్ళీ తన భార్య పిల్లలతో ముంబైకి వెళ్లాడు. మహేష్ తో పాటు `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లి అతని భార్య కూడా తమ కుమార్తెతో ముంబైకి వెళ్లారు.
ముంబైలోని ది సెయింట్ రెగిస్ రెస్టారెంట్ లో మహేష్- పైడిపల్లి ఫ్యామిలీ సభ్యులు డిన్నర్ కి వెళ్లారు. వంశీ అతని భార్య .. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ అతని భార్య క్లిక్ చేసిన చిత్రాన్ని నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా లో షేర్ చేశారు.
ఈ ఫోటోలో మహేష్ పొడవాటి జుట్టుతో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. సూపర్ స్టార్ తదుపరి సోషల్ డ్రామా `సర్కారు వారి పాట` చిత్రీకరణలో పాల్గొంటారు. జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ మూవీ తర్వాత రాజమౌళి.. త్రివిక్రమ్ లతో సినిమాలు చేయనున్నారు.